మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
అయ్యప్ప స్వామి చరిత్ర
ప్రార్ధన
కం॥ శ్రీహరి భస్మాసురునిన్
మోహినియై మట్టుబెట్టెమును, హరుడామెన్
మోహించి వివశుడాయెను
ఆ హరిహరసుతుడు వెలసి అయ్యప్పాయెన్
శా॥ కష్టంబైనది స్వామిదీక్ష అయినన్ కాపాడు అయ్యప్పయే
ఇష్టంబున్ తగునమ్మకంబునదియే ఏకార్యమున్ దీర్చురా
స్పష్టంబైనది నాకు దీక్షగొను ఆ స్వాముల్ని వీక్షించగా
నష్టంబైనను లెక్కజేయరరరే! నైనాలు వర్షించినన్
కం॥ పనిగొని, మనవిని వినడని
తన 'వారినె' కనునుగాని, తను 'నా వాడా?”
అనుకొని మననము 'మానితి’
ననఘా! 'నేకాను' అనకు అననికపైనన్
ఉ॥ పందళ రాజపుత్రుడును పావనుడయ్యప
స్వామిగాధలన్
ఇందు, వచించనెంచితిని ఈశ్వరు దివ్య
కటాక్ష లబ్దిచే
ఇందిర ప్రాణవల్లభుడు ఇంతిగ శంకరు
పేర్మికూడగా
కందువ తాను బుట్టె మణికంఠుడు ఆ మహిషిన్
వధించనై
తే॥ శబరికొండల రాయుడే శరణు అనుచు
పంపనదిజలమ్ముల ద్రావి పరవశించి మెట్లు పద్దెంది ఎక్కిన మేలుజరుగు దీక్షబట్టిన వారికి రక్ష స్వామి.
సీ॥ భరతుని వలె ప్రభు పాదుకల్ గొనలేను సౌమిత్రి వలె సేవ జరుపలేను సుగ్రీవువలె నేను సుఖ శాంతులీజాల పడవ గుహుని వోలె నడుపలేను
హనుమంతుడై పూని వినిపింప సతి జాడ ఖగరాజు వలె రక్ష గరపజాల అలవిభీషణు రీతి అర్ధింప శరణమ్ము గాధేయువలె విద్య గరపజాల
తే॥ పడి జటాయువు రీతినే ప్రాణమీయ శబరివలె పండ్లు తినిపింప సాధ్యమౌనె రామచంద్రా! శరణు అంటి రావె దరికి దిక్కువేరేది? ఇక నాకు తెలుపవయ్య!
సీ|| చలిచలి స్నానాలు స్వామి ఆరాధనల్ నిరుపమ భక్తియు నిష్ఠవలయు దీక్షలో దాల్చుచు దీక్షాంబరంబులన్ పాదరక్షలు వీడి బ్రతుక వలయు
సంసార సుఖమును, హింసను త్యజియించి గురు స్వాములను గూడి తిరుగవలయు ‘ఇరుముడి' తలకెత్తియేగి అయ్యప జూడ 'శబరిమలై యాత్ర' జరుపవలయు
తే॥ చిన్న పద్యంబులో అన్ని చెప్పలేను చెప్పగలవాడ మిత్రమా! చిన్నమాట దీక్షబట్ట సాధ్యము కాదు ధృతియు లేక పట్టుదల ఇచ్చు వాడు ఆ పావనుండె
కం॥ బల్లిదుని ‘అయ్యపో' అని
ఉల్లంబున నిల్పిపాడి యుజ్వల రీతిన్
చల్లటి ప్రేమను పొందెద
ఎల్లరు మెచ్చంగ నన్ను ఇది వాని “దయే”!
అయ్యప్ప స్వామి చరిత్ర
శ్రీమన్నారాయణుని దశావతారములు కథలు భాగవతుల కందరికీ విశదమే. ఇవిగాక ఆ పరమాత్మ మరెన్నో అవతారాలు ఎత్తి కొన్నిటిలో జ్ఞానబోధ, కొన్నిటిలో ధర్మ రక్షణ, కొన్నిటిలో దుష్ట శిక్షణ ఇలా ఎన్నో జనోపయోగమైన కార్యములు నెరవేర్చాడు. 'సంభవామియుగే యుగే' అన్నట్లే...... ఎన్నో అవతారాలు ఎత్తాడు. శబరిమలాధిపుడైన మణికంఠుని అవతారము అయ్యప్పస్వామి యను ఆ హరిహరనందనుని కధ ఎంతో హృద్యమం.
కం॥ మానవ జన్మకు సార్ధక
మైనది ఇంకేమిటి? పరమాత్మ దెలియుటే, వానిని గాంచక ఇప్పుడు
తానొందక మరొక జన్మ, తప్పదు భువిలో.
తా॥ మానవ జన్మకు పరమాత్మను దెలియుటకన్నా సార్ధకత ఏమున్నది? ఆయనను తెలుసుకొనకపోతే భూమిపై మరొక జన్మఎత్తక తప్పదు.
హరిహరు లిద్దరూ ఒకే పరమాత్మకు వేర్వేరు కార్యక్రమాలలో వేర్వేరు రూపాలని గ్రహించినప్పుడు వారిలో ఎవరు అధికులనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రత్యేక అవతారం 'ధర్మశాస్త్ర' అని పిలువబడి స్వామి అయ్యప్పగా జగద్విఖ్యాతమైనది.
కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై చరిస్తుంది. కావున ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న ఈ అవతారమూర్తి గాధ తెలుసుకొనుట సర్వోత్తమం. పెద్ద ఉద్గ్రంధం వ్రాసి కల్పన జోడించి కావ్యలక్షణాలు అతికించటం నాకు ఇష్టమూలేదు. అంత సామర్ధ్యమూ లేదు. స్వామి అవతార చరిత్ర క్లుప్తంగా గద్యపద్యకృతిగా చేయాలని నా ఆశ. గద్యపద్య రచన అనడం ఎందుకంటే ఇందులో గద్యమే ఎక్కువ ఉంటుంది కనుక.
ఆ॥ 'రంబ' అనెడి వాడు రాక్షసుడొక్కండు కలడు తొల్లి, వాన్కి కలిగె కొడుకు వాని మిత్రుడైన వాడే 'కరంబుడు’
కలిగె దుహిత వాన్కి కఠినురాలు
రంబ కుమారుడు మహిషాసురుడని పేరు గాంచాడు. వాడు బహుక్రూరుడు. సుదీర్ఘమైన వాని చరిత్ర ఈ రచన ప్రధాన విషయము కాకుండినను క్లుప్తముగా తెలిపెదను.
మహిషాసురుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి చతుర్ముఖుని మెప్పించాడు. బ్రహ్మ వానిముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.
కం|| ఏ మగప్రాణి కరంబుల
నా మరణము జరుగకుండ నను బ్రోవుమయా! ఏ ముదిత నన్ను జంపును?
ఏ మాత్రము వెఱపు లేదు ఇది నిజము ప్రభూ!
తా॥ ఓదేవా! ఏ మగప్రాణి చేతిలోను నాకు మరణము రాకుండ అనుగ్రహింపుము. ఇక స్త్రీలంటావా? వారివల్ల నాకేమాత్రము భయములేదు.
అని అహంకరించి పలికాడు. విధాత 'తధాస్తు' అని యధాస్థానమునకు వెళ్ళాడు. ఇక వరగర్వంతో మహిషాసుర ఆగడాలకంతులేదు. యజ్ఞయాగాలను
విఘ్నం చేశాడు. వేద పఠనాన్ని నిలుపు చేశాడు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించి దేవతల్ని ఎన్నో రకాలుగా హింసించాడు. శివ, విష్ణు పూజలను నిషేధించాడు. దేవతలు ఆ బాధలు తట్టుకోలేక పరమేశ్వరునితోను ఆయన సలహాపై విష్ణుమూర్తితోనూ ఆపైన అందరూ కలిసి పరమేశ్వరితోనూ మొరపెట్టుకున్నారు. పరమేశ్వరి తన అంశతోను హరిహరుల అంశతోను ఇంద్రాది సకల దేవతల తపశ్శక్తిని మేళవించి చండికా దేవిని సృష్టించెను.
ఆ॥ రక్తనేత్రియైన లలన భయంకరి వివిధ ఆయుధములు వేల్పులీయ హస్తములను దాల్చి అమిత క్రోధమ్ముతో మహిషు జంప నేగె మాత చండి.
తా॥ రక్తమోడ్పునేత్రములున్న ఆదేవి రకరకములైన ఆయుధములను దేవతలీయగా ధరించి అమిత క్రోధముతో మహిషాసురును చంపుటకు బోయెను.
విఘ్నం చేశాడు. వేద పఠనాన్ని నిలుపు చేశాడు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించి దేవతల్ని ఎన్నో రకాలుగా హింసించాడు. శివ, విష్ణు పూజలను నిషేధించాడు. దేవతలు ఆ బాధలు తట్టుకోలేక పరమేశ్వరునితోను ఆయన సలహాపై విష్ణుమూర్తితోనూ ఆపైన అందరూ కలిసి పరమేశ్వరితోనూ మొరపెట్టుకున్నారు. పరమేశ్వరి తన అంశతోను హరిహరుల అంశతోను ఇంద్రాది సకల దేవతల తపశ్శక్తిని మేళవించి చండికా దేవిని సృష్టించెను.
ఆ॥ రక్తనేత్రియైన లలన భయంకరి వివిధ ఆయుధములు వేల్పులీయ హస్తములను దాల్చి అమిత క్రోధమ్ముతో మహిషు జంప నేగె మాత చండి.
తా॥ రక్తమోడ్పునేత్రములున్న ఆదేవి రకరకములైన ఆయుధములను దేవతలీయగా ధరించి అమిత క్రోధముతో మహిషాసురును చంపుటకు బోయెను.
అది తెలిసి బలిష్టమైన తన సేనలోని ఉద్దండులను ఎన్నుకొని ఆమెపై పోరుకు పంపేడు మహిషుడు. వారిని లెక్కకు ఒక్కడైన లేకుండా యమపురి పంపిందామె. అదిజూచి ఆగ్రహోదగ్రుడై మహిషాసురుడు ఆమెపై యుద్ధానికొచ్చాడు. వాడి శక్తి ఆ 'శక్తి' ముందు చాలలేదు. అయినా బ్రహ్మవరప్రసాది గనుక భీకరమైన పోరు సలిపాడు. మహిషాకృతితో ఆమెని సంహరించటానికి అతివేగంగా వచ్చాడు.
తే॥ 'వాడి' కొమ్ముల శిరమును పైకి లేపి పొడిచి చంపగ చండిని ఉరకలెత్తి
వచ్చె మహిషుడు అరచుచు, వానిబట్టి నేలకానించి ఖండించె నీచు శిరము
తా॥ ఆ మహిషాసురుడు తన వాడి కొమ్ములున్న తలను పైకెత్తి వరుగులెతఇ అరస్తూ 'చండిని' సంహరించుటకు రాగా ఆదేవి వాని తల
నేలకానించి నరికివేసెను.
రౌద్ర రూపిణిని దేవతలందరు కీర్తించి శాంతపరచి ఆమెను ప్రసన్నురాలిని చేసుకున్నారు. అందుకే ఆ దేవిని దుష్ట శిక్షణచేసి ఆపన్నులను కాచే దేవతగా పూజిస్తున్నారు. 'కరంబ' కు స్త్రీ శిశువు జనించినదని మున్ను తెలుసుకుంటిమి. ఆశిశువు పేరు 'మహిషి' ఆమె కూడ అన్నగారి వలె క్రూర స్వభావినియై అందరు రాక్షసులవలె సురగణములపై విపరీతమైన ద్వేషముతో యుండెను. అగ్నికి ఆజ్యముతోడైనట్లు ఆ దుర్మార్గురాలికి, మహిషుని మరణం అశనిపాతంలా తగిలి, దేవతలపై పగ రెట్టింపయింది. ఆమెకూడ బ్రహ్మకై ఘోర తపస్సు చేసింది. చం|| ఎముకల గూడుయై మహిషి ఎన్నడు వీడక
బ్రహ్మ నామమున్
విమలపు దీక్ష బల్కుచును వేడె కృపారస
వృష్టికోసమై
సముఖము జేరెనా నలువ సాగిలి మ్రొక్కిన
దానికిట్లనెన్
సుముఖుడనైతినో లలన సొంపుగ జేకొను పూర్వరూపమున్
తా॥ ఆ మహిషి ఎముకలగూడులా మారినా పట్టుబట్టి నలువ(బ్రహ్మ) యొక్క దయకోరుచు ఘోరతపస్సు చేయగా ఆయన ఓ మహిషీ! నీ తపస్సునకు సంతోషించాను, ముందు నీ పూర్వరూపం ధరించు
అని పలికాడు.
వెంటనే ఆ మహిషి తన రూపం పొంది బ్రహ్మను వేనోళ్ళ కీర్తించింది. బ్రహ్మసంతుష్టుడై నీకేం వరం కావాలో కోరుకో మన్నాడు. ఆ రాక్షసి
"ప్రభూ! ఇంద్రాది దేవతలను గెలువగల బల సంపదలు నాకు ఉన్నాయి. అయినా నేను వారినేమీ చేయలేదు. కాని వారు కుతంత్రాలతో నా సోదరుణ్ణి చంపించారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. శివకేశవులు నన్ను ఏదో రూపంలో మట్టు బెట్టాలని చూస్తారు. అందుచేత నాకు హరిహరుల చేతిలో మరణించకుండునట్లు వరం ఇమ్ము అని ఆ వరం పొందింది. అంతటితో ఆమె కసి రెట్టింపై మహిషాసురుని వలె లోక కంటకి అయింది.
కం॥ హరుచే యైనను తనకా
హరిచేతను యైన చావు అవదని వీగెన్
వరబల్మి పాతకమ్ములు
జరిపెను మహిషియును తాను జగముల పీడై
తా॥ హరిహరులిద్దరిచేత చావు లేకపోవటంవల్ల ఆ వర బలముతో మహిషి ఎన్నో ఘోరపాతకములను చేస్తూ లోకాలకు ఒక పీడ అయింది.
ఇదిట్లా ఉండగా........
పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడుండే వాడు. వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. కత్తులు మొదలైన ఆయుధాలు అవసరం లేకుండా తన శత్రువులను చంపినట్లు కూడ తెలియకుండ క్షణంలో చంపుటెట్లో అని ఆలోచించాడు. ఆ ఆలోచన ఏమంటే తన శత్రువులను భస్మం చేసి చంపుట. వెంటనే పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు.
తే॥ ఒంటి కాలిపై నిలుచుండి యొగ్గి తిండి, చేరి దావానలంబున శివుని గూర్చి
ఘోర తపమును చేసెను మరచి నిదుర మూడు లోకాలు వణికెను గడగడమని
తా॥ ఆ భస్మాసురుడు ఆహారం మానివేసి, ఒంటికాలిపై దావానలం మధ్యలో నిలబడి ఘోరమైన తపస్సు బ్రహ్మగూర్చి చేసాడు. నిదుర త్యజించిన వాని తపసు చూచి ముల్లోకములు తల్లడిల్లెను.
ఇక చాలు అనుకుని పినాకపాణి ఆ దైత్యుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తన విచిత్రమైన కోరిక తెలిపాడు. భస్మాసురుడు. అటువంటి వరం ప్రమాదకరం ఇంకేదన్నా కోరుకోమన్నాడు శివుడు. ససేమిరా అన్నాడు దానవుడు. అడిగిన వరం ఈయక తప్పలేదు ఈశ్వరునికి. 'తధాస్తు' అన్నాడు. అప్పుడా దుర్మార్గుడిలా అన్నాడు.
కం|| తటపటలాడుచు నిస్తివి నిటలాక్షా! నమ్మలేను నీదు వరమునే
నిట ఆ మహిమను జూచెద
తృటిలో నీనెత్తిపైన దేవా! ఇపుడే!
తా॥ ఓ శంకరా! ఇవ్వాలా వద్దా అని తటపటలాడుతూనే నాకు వరం ఇచ్చావు. నీమాట నమ్మలేదు. దేవా! నీ నెత్తిపై నాచెయ్యి పెట్టి ఒక్క క్షణంలో నిజం
తెలుసుకొంటాను.
కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు, పోయి పోయి పీడ తనకు చుట్టుకుందే అని పరుగు లంకించు కున్నాడు పరమశివుడు. ఇది ముందే ఊహించిన శ్రీహరి తన మోహినీ అవతారం దాల్చి పరుగు పెడుతూ తరుముతున్న భస్మాసురుని ముందు నిలిచాడు. 'ఆగు ఆగు' అని రాక్షసుని నిలువరించి “ఇంత అందమైన శరీరానికి ఈ జడలూ గడ్డమూ ఏమిటి? పిచ్చివాళ్ళు రాళ్ళ దెబ్బలకు తాళలేక పరుగులు పెడుతున్నట్లా ఉరుకు లేమిటి” అని ఆపింది. కలలో నడుస్తున్నట్లు ఆమె వెంటపడ్డాడు, అసురుడు. ఆమె ఆజ్ఞానువర్తి అయిపోయాడు.
సీ॥ తకధిమ్మి తకధిమ్మి తరుణి తాండవ మాడ తకధిమ్మియని ఆడె దానవుండు
హొయలంత జూపుచు ఒంగినన్ ఆ లేమ అదెరీతి వంగును అసుర విభుడు మునిపంట అధరంబు మోహిని నొక్కంగ తను అదే విధిజేయు దైత్యశ్రేష్ఠి ఆత్మ ప్రదక్షిణ అతివ జేయుచు నవ్వ లలనన్ అనుకరించు రాక్షసుండు
ఆ॥ వామ హస్తంబు తలపైన వనితయుంచ అనుకరించెను నవ్వుచు అసురుడంత పెద్ద విస్ఫోటమై తాను పెట్టికేక
దగ్ధమయ్యె భస్మాసుర దనుజపతియు
తా॥ ఆ మోహిని తకథిమ్మి తకథిమ్మి అనునట్లు నాట్యం చేయగా భస్మాసురుడు కూడ అలాగే చేశాడు. ఆమె వయ్యారం ఒలికించి వంగితే వాడు వంగి చూపాడు. మోహిని మునిపంటితో క్రింది పెదవి నొక్కుకుంటే రాక్షసుడూ అలాగే చేశాడు.
ఆత్మప్రదక్షిణం చేసి ఆ సుందరాంగి నవ్వితే వాడూ అదే చేశాడు. ఆ భామిని తన ఎడమచేతిని తనతలపై పెట్టుకొనినది. భస్మాసురుడు కూడా అలాగే చేశాడు కాని పెద్ద ధ్వనితో చూస్తుండగానే దగ్ధమై పోయాడు.
ఆకేక విని పరమేశ్వరుడు మరుగునుంచి వెలువడి మనస్సుని వివశ చేసే ఆ మనోజ్ఞను చూశాడు. ఆమెతో సుందరీ నీవు ఎవ్వతెవు? ఈ రాక్షసుని మట్టుబెట్టిన నీ తెలివి తేటల్ని మించిన నీ అందము పుష్పానికి మనోహరమైన సువాసనవలెనున్నది. ఇంత సౌందర్య రాశిని కన్న నీతండ్రి ఎవరు? నీ నెలవు ఏది? నీపేరేమి? నీ వారెవరెవరు? అని ప్రశ్నించాడు. అందుకామె నవ్వుతూ.....
ఆ॥ తల్లిదండ్రి లేని దానను ఓ ప్రభూ! ఎచ్చటైన నుందు ఇది నిజంబు పేరు ఏది యైన ప్రేమనే కోరెద నన్ను కోరువారె నాకు హితులు
తా॥ ఆ మోహిని నర్మగర్భంగా నవ్వుతూ శంకరునికిట్లా సమాధానమిచ్చింది. ఓ ప్రభూ! నేను తల్లిదండ్రులు లేని దానను. ఎక్కడైనా ఉంటాను. నిజం చెబుతున్నాను ఏ పేరుతో పిలిచినా పిలిచిన వారి ప్రేమను కోరుకుంటాను. నన్ను కోరుకొనేవారు నాకు ఇష్టులు.
అన్నది. మోహావేశంలో నున్న వ్యోమకేశుడు మోహిని పలుకులలోగల గూఢార్ధము నెంచక ఆమెవలపులు కావాలన్నాడు. అంగీకరించిన మోహినీ రూపుడగు హరికి, హరునకు ఉదయించిన బాలుడే శ్రీ అయ్యప్పస్వామి బాలుని జన్మకారణమే మహిషిని సంహరించి ధర్మ
సంస్థాపన జేయుట, కలియుగంలో ఒంటిపాదం పై నిలిచియున్న ధర్మదేవతకు భారం తొలగించి సుఖ శాంతులు కలుగచేయుట.
మహిషి దుర్మార్గముల నరికట్టుటకు ఉద్భవించిన ఆ బాలుని మెడలో బంగారు గంట కట్టబడి దేదీప్యమానమై వెలుగొందుచున్నది. పందళ రాజ్యమును పాలించెడి రాజశేఖర మహారాజు వేటకని వెళ్ళగా అక్కడ ముద్దు
లొలుకు పసి బాలుడు కనిపించెను.
ఉ॥ ఇంతటి ఘోర కాననము, ఎవ్విధి కూనకు
ఆశ్రయంబవున్
ఎంతటి వీరులైన ఇట ఈ మృగజాతిని తాళ
లేరు పో
సంతసమౌనె? పాపడిని జాలిని వీడుచు
కానద్రోయగా
ఎంతటి దుర్మతుల్ మనుజు లిత్తరి వీనిని పారవైచిరే!
తా॥ ఇంత ఘోరమైన అరణ్యం ఈ పసివానికెలా ఆశ్రయమైనది? ఈ భయంకరమైన మృగములను చూచి వీరాధివీరులే తాళలేరే! పిల్లవాడినిలా వదలి వెళ్లటం, అదీ అడవిలో ఇంత నిర్దాక్షిణ్యంగా పోయారే! ఆహా మానవులు ఎంత దుర్మార్గులు?
అని విచారించి ముద్దులొలుకు ఆ బాలుని మెడలో బంగారు ఘంట చూసి ఆశ్చర్యం రెట్టింపయింది రాజుకు. నిశ్చేష్ఠుడై ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే.....
కం॥ చనెనటకా భగవంతుడు
తను ఒక బ్రాహ్మణుని రూపు దాల్చుచు ఆపై అనెనిట్లు “రాజశేఖర!
కొను మీ మణికంఠు, పెంచు, గూర్పగముదమున్
తా॥ ఆ భగవంతుడే రాజశేఖరుడి వద్దకు బ్రాహ్మణుని రూపంలో వచ్చి “ఓ రాజశేఖరా! నీకు సంతోషం కలిగించునట్లు ఈ మణికంఠుని (మెడలో గంట కట్టబడిన వానిని) పెంచుకో” అన్నాడు.
వీని అసలు రూపము 12 సంవత్సరాలకు తెలుస్తుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిన రాజశేఖరుడు అఘమేఘాలమీద తన రాజధాని చేరి పందళ దేశ పట్టపు రాణితో ఇక నీవు సంతానము లేదని విచారించాల్సిన పనిలేదు వీడు నీకు స్వయంగా భగవంతుడిచ్చిన మణికంఠుడు. వీనికి మాతృమూర్తివై నీ జన్మ చరితార్ధం చేసుకో అని చెప్పాడు. రాణి సంతోషంతో ఆ బాలుని పెంచింది. వానిని ఒక ఉత్తముడైన గురువునకు ఒప్పగించి ఈ దేశ భావి మహారాజును తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీదే అని ఒప్పచెప్పారు రాజదంపతులు.
ఆ గురువు నమ్మలేనంత వేగంగా మణికంఠుడు సకల విద్యాపారంగతుడైనాడు. మణికంఠుడు సుగుణాలగని అయ్యాడు, సుందరాకారుడయ్యాడు.
సీ॥ వేద వేదాంగముల్ విరివిగా శాస్త్రాలు
అధ్యయనము జేసె అయ్యె వేత్త కత్తిసామును నేర్చె కడు లాఘవంబుతో మెరుపులా ఝళిపించు మేటి అయ్యె పాలాక్షునెదిరించు ఫల్గుణుండా అనన్ విలువిద్యలో తాను పేరునొందె
కళలందు యెంతయో ఘనుడని చూపరుల్ ముక్కుపై వేలుంచి ముగ్ధులైరి
తే॥ నమ్మజాలకపోయిరి తమ్ముతామె మనిషి కాడేమొ ఈతండు మనను బ్రోవ భువికి యేతెంచు దైవమో ఈ విధమున తలచె గురుదేవులిట్లని తన్మయమున.
తా॥ ఆ మణికంఠుడు విస్తృతంగా వేదవేదాంగములను, శాస్త్రములను చదివి పండితుడైనాడు. అతి నేర్పుగా కత్తిసాము నేర్చి మెరుపులా కత్తిని ఝళిపించు
వాడయ్యెను. విలువిద్యలో త్రినేత్రునే ఎదిరించిన అర్జునుని వలె మొనగాడయ్యెను. కళలలో ఎంతో మనుడని అందరు ఆశ్చర్యంతో ముక్కుపై వేలేసుకున్నారు. తమని తామే నమ్మలేక ఇతను నరుడు కాడేమో! మనలను రక్షించుటకు భూమిపై దిగిన పరమాత్మేమోనని అతని గురువులు అంతా అనుకొన్నారు.
ఆవిధంగా సర్వ విద్యా పారంగతుడైన శిష్యుడు మణికంఠుని చూచి గురువు నాయనా! నీలాంటి శిష్యుడు దొరుకుట నా అదృష్టం. చిన్నవాడివి నీకు నమస్కరించ రాదు అయినా నిన్ను దైవంగా భావించి నమస్కరిస్తున్నాను. ఈ బాలుడు నా కుమారుడు. అయితే.....
చం|| వినుమిది నాయనా! కొడుకు పెన్నిధియంచని
పెద్దలందరున్
ఘనముగ చెప్పుచుందురుగ కాని, అదేమిటొ
పుట్టుతోడనే
వినబడదాయె బాలునికి ప్రీతిగ పల్కుట చేతకాదు ఈ
కనులలో కాంతిలేదు పెను కష్టములాయెను అందుచేతనే.
తా॥ నాయనా! పుత్రుడు గొప్ప భాగ్యమని పెద్దలంటారు కానీ అదేమిటో ఈనా పుత్రుడు పుట్టుకతోనే చెవిటివాడు అందుచే మూగవాడు కూడా. దానివల్ల ఆనందమనునది లేక నాకనులు కాంతిహీనములై దుఃఖమే మిగిలింది
కన్నీటితో పలికిన తన గురుని చూసి వినయంగా సరేనని ఆ బాలుని ఆశీర్వదించి మణికంఠుడు అతని అవిటితనం సరిచేశాడు. 12 సంవత్సరాల బాలునిగా అతను మరెన్నో దివ్యమహిమలు చూపించాడు.
విద్యాభ్యాసము పూర్తి అయిన మణికంఠుడు తన
తలిదండ్రులను చేరుకుని వారి ఆనందం ఇనుమడింప చేశాడు. పందళ రాజ్యప్రజలకి అతనంటే అవ్యాజానురాగం. తమవేలుపని, తమ భావి మహారాజని వారు అతనిపై తమ ఆశలు నిలుపుకున్నారు.
కం|| రాజన నీతడె ఆ రే
రాజుకు సరియైన వాడు రాజులలోనన్ రాజిల్లె దైవమా యన
రాజాలడు వీని కన్న లావగు నృపుడున్.
తా॥ రాజంటే ఇతడేనయ్యా! రాజులలో చంద్రుని బోలిన వాడు. భగవంతుడా అన్నట్లు విరాజిల్లుతున్నాడు. ఇతనిని మించిన రాజు మనకు లభించుట జరగదు.
యౌవరాజ్య పట్టాభిషేకం కాకుండానే ప్రజలంతా ఈ విధంగా భావి పాలకునిపై ఆశలు పెట్టుకోవటం ఒక్క త్రేతాయుగంలోనే శ్రీరామచంద్రుడి విషయంలో జరిగింది. భగవదవతార పురుషులకిది మామూలేనేమో! వారికి అందుకే ఇబ్బందులూ తప్పవు.
రాజశేఖర మహారాజు తన రాణితో సుఖంగా ప్రజాపాలన చేస్తున్నప్పుడు మణికంఠుడు విద్యాభ్యాసానికి వెళ్ళిన రోజుల్లో దైవ సంకల్పమా అన్నట్లు రాణి గర్భవతయింది. రాజదంపతులు పరమానంద భరితులై భగవానునికి కృతజ్ఞతలు తెలిపారు.
కం॥ ఎలనాగకు నిండెనుగా
నెలలును, సంతోష భరిత నెలతకు కలిగెన్
నెలరాజు వంటి బిడ్డడు
పులకితుడై రాజు శివుని పూజలు చేసెన్.
తా॥ రాణికి నెలలు నిండినవి. సంతోష భరితయైన ఆమెకు పున్నమి చంద్రుని వంటి బిడ్డడు
కలిగాడు. రాజు సంతోషంతో పులకించి శివుని
ఆరాధించాడు.
| ఆ బాలునికి రాజరాజు అని పేరు పెట్టారు. అతను కూడా శ్రీరామచంద్రునికి లక్ష్మణుని వలె సరియైన తమ్ముడనునట్లు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. స్త్రీకి తను మాతృమూర్తి అవబోతున్నదని తెలియగానే మానసికంగా కూడా ఎన్నోమార్పులు వస్తాయి. అదే మంచి అంతా తన బిడ్డకే జరగాలనే స్వార్ధం. అందుకే ఒకప్పుడు కైక భరతుని | పట్టాభిషేకం, రాముని వనవాసం వరాలుగా కోరుకుంది. | ఆనాడు కైక స్వతహాగా మంచిదే, కాని మంధర ఆమె మనసు స్వార్ధంవైపు ఎగత్రోసింది. ఇప్పుడు మణికంఠుని కథలో కూడా అదే జరుగబోతోంది.
ధీరోదాత్తుడైన మణికంఠునికి తనతమ్మునిపై గల
అనురాగం చూసి రాజదంపతులు పరవశించి పోయారు.
వారు తమకన్న బిడ్డకు మణికంఠుని రక్షణ దొరుకుతుందని | నమ్మకం గలిగి పరమానంద భరితులయ్యారు.
ఒకనాడు......
ఆ॥ రాజశేఖరుండు రావించి మంత్రుల మనసులోన నున్నమాట తెలిపె
మాకు తోచుచుండె మణికంఠునభిషిక్తు
చేసి రాజు చేయ శీఘ్రగతిని
తా॥ రాజశేఖరుడు తన మంత్రులను రప్పించి తన మనస్సులో మాట చెప్పాడు. మాకు మణికఠుని త్వరగా రాజును చేయవలెనని కోరికగా ఉన్నది అన్నాడు.
ఆ మాటలకి మంత్రులందరూ సంతోషాభినందనలు తెలిపారు. కాని ప్రధాన మంత్రి పైకి సంతోషం ప్రకటించినా మనస్సులో దిగులు పడ్డాడు. ఎందుకంటే అతని కపట జిత్తులు రాజశేఖరుని ముందు పారుతాయిగానీ మణికంఠుని ముందర పారవు. మణికంఠుడు మంత్రి ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్ధుడు. మంత్రి రాణిని దర్శించి తన మనస్సులోని మాట మెల్లిగా బయట పెట్టాడు.
శా॥ భావోద్రేకము జేత రాజు తలచెన్ పాలింప
బిడ్డకు
తావేలేదని, కన్నబిడ్డ కకటా! ధర్మంబె? కాదందురే!
ఏవో చెప్పుడు మాటలన్ని వినెనో ఈ రాజు
వింతాయెగా
నీవేశ్రద్ధ వహించి కావవలె రాణీ! జాగు ముప్పౌ సుమా!
తా॥ ఓ రాణి! మహారాజు ఏదో భావోద్రేకంలో మునిగి పరిపాలించుటకు నీకన్న కొడుకుకే అవకాశం లేదంటున్నాడు. అయ్యో! కన్న కుమారునికి అన్యాయం చేయటం మంచిదా? ఏమన్నా చెప్పుడు మాటలు విన్నాడేమో? వింతగా ఉంది. ఇక నీబిడ్డకు అన్యాయం జరుగకుండా నీవే చూసుకోవాలి. లేకపోతే ప్రమాదం
సుమా!
మొదట రాణి ఆ మాటలకు ఆగ్రహించి మంత్రిని పంపివేసింది. కానీ విషబీజం నాటాక అదిపెను వృక్షం అవడం ఎంతసేపు? రాణి మొదట నిందించినా తరువాత మంత్రి చెప్పింది నిజమే అని నమ్మింది. నేడు మణికంఠుడు మంచి వాడే కావచ్చు. కానీ పదవి చాల చెడ్డది.
ఆ॥ పాము పడగ నీడ బావురుకప్పకు
రక్ష అగుట కద్దె? రాదె ముప్పు? మంచివాడు నేడు మణికంఠుడైననూ రేపు పదవి చెఱచు 'రేపు' ఆశ
తా॥ ఓ రాణీ! పాము పడగ నీడలో బావురు కప్ప రక్షణ పొందటం సంభవమా? ఆపదరాదా? మణికంఠుడు నేడు మంచి వాడే కాని పదవీ కాంక్ష రేపు అతనిని చెడగొడుతుంది. అతనిలో ఆశను రేపుతుంది.
"ఓ రాణీ! నేనెంతోమంది రాజులను చూశాను. తమ క్రింద బానిసలుగా బ్రతికే వారిని పోషిస్తారు. కానీ వారి ఇష్టాన్ని మనం కాదనగానే ప్రాణాలు తీస్తారు. నీ బిడ్డకు ఏనాటికైనా
బలవన్మరణం తప్పదు..... తప్పదు” అని హెచ్చరించిన మంత్రి మాటలు ఆమె తలకెక్కాయి. ఒక నిశ్చయానికి వచ్చి మంత్రిని పిలిపించి ఏది దారి అని అడిగింది. జిత్తులమారి | నక్కవంటి మంత్రి ఇలా అన్నాడు. ఓ దేవీ! నేను నీ తండ్రివంటి వాడను. నాకు మణికంఠునిపై ద్వేషం లేదు. నీబిడ్డే సింహాసనానికి వారసుడని న్యాయం తెలిసిన వాడిని | కనుక చెప్తున్నాను.
కం॥ ముల్లును వెలిదీయుటకై
ముల్లే కావలయు నమ్మ! ముప్పు నెరిగియున్ తల్లిగ బిడ్డను గాచిన
యెల్లరు మెచ్చెదరు జంకు యెందుకు తల్లీ!
తా॥ అమ్మా! ముల్లును ముల్లుతోనే తీయాలి. ఆపద నెరిగిన దానిపై నీతిడ్డను నీవు రక్షించు కొంటే అందరూ మెచ్చుకొంటారు సందేహమెందుకు తల్లీ!
మీరు మణికంఠుని ఘోరంగా చంపించనవసరంలేదు. మీకు అనారోగ్యంగా ఉందని అది తగ్గవలెనంటే పులిపాలు కావాలనీ రాజుకి వైద్యులచే చెప్పిద్దాం. రాజు మణికంఠుడు గాక వేరొకరిని పంపాలని చూస్తాడు. కానీ వీరాధివీరుడైన మణికంఠుడు తనే వెళ్తాడు. అప్పుడు అతనిని ఏదో విధంగా మట్టుబెట్టి పులిచే చంపబడ్డాడని ప్రచారం చేయించవచ్చు.
అంతేకాక ఓ రాణీ! ఇక్కడ ఇంకో ముఖ్య విషయం వుంది. వివరిస్తాను వినండి.
సీ॥ అడవిలో సర్పాలు, అతి క్రూర జంతువుల్
తిరుగాడు అందుచే తిరిగి రాడు
వాటిచే తప్పిన, బందిపోట్లకు జిక్కి హతుడౌను సంశయంబందు లేదు అది తప్పినన్ పోయి ఆటవికులజేత బలియౌను చింతించ పనియె లేదు పులిపాలకై జూడ పులినవ్వి పాలీదు పంజా విసిరి వాని బంపు ‘పైకి’
తే॥ తిండికేడ్చుచు మరణించు, తిరిగి రాడు భూత ప్రేతాల పాల్పడి పుడమివీడు మట్టి అంటక చేతికి మట్టుబెట్టి నీకు మణికంఠు పీడను నేను దీర్తు
తా॥ ఓ రాణీ! అడవిలో విషసర్పములు, కూౄర జంతువులు తిరగాడుతుంటాయి కాబట్టి మణికంఠుడు తిరిగిరాడు. ఒక వేళ వాటిని తప్పించు కొన్నా దారి దోపిడి దొంగల చేతిలో చస్తాడు. పోనీ అది తప్పినా ఆటవికులు చేతిలో బలి అయిపోతాడు. దిగులుపడకు. అతడు ఒకవేళ పులి దగ్గరకు వెళ్ళినా, పులి నవ్వుతూ పాలిస్తుందా? పంజాతో కొట్టి చంపుతుంది. అదీ కాక తిండిలేక అలమటించి రావవచ్చు. భూతలూ, దయ్యాలూ చంపవచ్చు. మన చేతికి మట్టి అంటకుండా నీకు
మణికంఠుని పీడ వదిలి పోతుంది.
ఇంత విపులంగా తన పథకం వివరించిన మీద రాణిగారు | ఆ పథకం నెరవేరుతుందని తృప్తిజెంది పథకం అమలులో పెట్టింది. రాణిగారి 'విచిత్రమైన వేదన' ఎవరికీ అర్ధం
కాకుండా వుంది. ఈలోగా మంత్రి తనవంతు పని తను చేయటం మొదలు పెట్టాడు. మొట్టమొదటి ప్రయత్నంగా ఆయన మణికంఠునికి కాలకూట విషప్రయోగం
చేయించాడు.
కాని మణికంఠుని విషమేమీ
చేయలేకపోయింది. తరువాత మరొక ప్రయత్నంగా మళయాళ మాంత్రికుని చేత మంత్ర ప్రయోగం చేయించాడు. మంత్ర తంత్రాలు ఏమాత్రం పని చేయలేదు. కాని ఎన్నో దుశ్శకునాలు రాజశేఖరునకు కనిపించాయి. గోరు చుట్టుపై రోకటి పోటులా రాణిగారి అస్వస్థత ఆయనకు మరింత వేదన కలిగించింది.
కం॥ రావించి పెక్కు వైద్యుల
భూవల్లభుడంత వారి నొప్పగు రీతిన్ కావంగ రాణి గోరెను
ఆ వైద్యుల బ్రతిమిలాడె నార్తితొ నృపుడున్
తా॥ రాజశేఖరుడు ఎంతో మంది వైద్యులను రప్పించాడు. తన రాణిని కాపాడుమని వైద్యులను వేడుకొన్నాడు.
ఆర్తితో వారిని ప్రార్ధించాడు.
అది విని వైద్యులంతా మంత్రిచే నియమింపబడిన వారు కావున పెదవి విరిచి ఇట్లనిరి. రాజా! వైద్య శాస్త్రంలో ఇంత వరకూ ఈ రోగానికి ఇదమిద్దంగా మందిది అని కనుక్కోలేకపోయారు. కాని ఇటువంటి మొండి వ్యాధులకి | పులిపాలు దివ్యంగా పనిచేస్తాయి. వాటిని తెప్పించండి | ప్రయత్నిద్దాం.
ఆ॥ పులికి కాన్పు అయిన పోయి వివేకమ్ము
చంపి తినును క్షుధకు స్వంత కూన
అడవినుంచి దాని ఆ 'రాచనగరుకు’
తెచ్చుటెట్లు పాలు యిచ్చునెట్లు?
తా॥ పులికి కాన్పు జరిగి పులి కూనలు పుట్టాక కళ్ళు సరిగా కనిపించవు. పైగా ఆకలి ఎక్కువై స్వంత బిడ్డలనే తినివేస్తుంది. అట్లాంటి పులిని రాజధానికి చెచ్చుటెట్లు? అది పాలనిచ్చేదెట్లు?
| పైగా పాలు అతి త్వరగా ఆవిరి అయిపోతాయి. కావున | అడవిలోనే పిండి తేవటం అయ్యేపనికాదు. ఇంత వ్యవహారం
ఉంది కనుక ఈ పని చాలా కష్టం అని గ్రహించి, రాజశేఖరుడు పులిపాలు తెచ్చిన వారికి 'అర్థరాజ్యం' ఇచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానని చాటింపు వేయించాడు.
ఈ వార్త దావానలంలా ప్రాకి చివరికి మణికంఠునికి తెలిసింది. అతను తన తండ్రిని దర్శించుటకు పరుగు పరుగున అంతఃపురం చేరి, ప్రపంచాన్నే పోగొట్టుకున్న వాడిలా విచారగ్రస్థుడై యున్న తనతండ్రితో మాట్లాడి సంగతి తెలుసుకున్నాడు. అతను వినయంగా తండ్రి కిట్లా అన్నాడు.
రాజు ప్రజలగావ లక్షణంబుగ నుండు
స్వంత పనికి ప్రజల జంపరాదు
ప్రజల గావలేని వ్యర్ధులు రాజ్యంబు ఏల నేలతండ్రి! నేల ఏడ్వ?
తా॥ తండ్రీ ! రాజు ప్రజల్ని రక్షిస్తుంటే లక్షణంగా ఉంటుంది. తన స్వప్రయోజనాలకు ప్రజల్ని చంపుట తగదు. ప్రజల్ని రక్షించలేని నిరుపయోగులు రాజ్యం పరిపాలించనేల? ఈ నేల తల్లి ఏడ్వడానికి కాకపోతే.
దానికి రాజశేఖరుడు “నాయనా! నీ సామర్ధ్యం నేనెరుగుదును, కానీ నేను వృద్ధుడను పైగా రాణి బాధ్యత నాపై యున్నది. తమ్ముడు చాల చిన్నవాడు. నిన్ను పంపి రాజ్యానికి కాబోయే రాజుని దూరం చేయలేను. అర్ధ రాజ్యంతోనైనా ఆనందంగా మీ అన్నదమ్ములు జీవించగలరు. ప్రాణం పోయాక ఎంత సామ్రాజ్యం వుండి ఏం లాభం. జీవితం అశాశ్వతం అని తెలిసినా రాణిని రక్షించుట నా ధర్మం కావున ప్రయత్నిస్తున్నాను ఆ పైన పరమాత్మ దయ.
చం|| చనునెడ గడ్డిపోచయిన సాధ్యమె వెంటను
గొంచుపోవ, ఈ
ధనములు రాజ్యభోగములు ధాత్రిని వీడక
తప్పదందురే!
విననగు నేటికైన 'బలి' వేల్పుల జేరుట నీవిచే
గదా!
తనదగు భార్యకై పతికి ధర్మము జీవము లొడ్డ న్యాయమౌ.
తా॥ నాయనా మణికంఠా! చనిపోయేటప్పుడు చిన్న గడ్డిపోచనైనా వెంట తీసుకొని పోగలరా? భూమిని వదిలి పోయేటప్పుడు రాజ్యభోగాలు, ధనం విడిచిపోక తప్పదంటారు కదా! దేవతల సమానుడై తన కోసం ఒక లోకాన్నే ఆ శ్రీహరి వలన పొందిన బలిచక్రవర్తి దానము చేతనే కీర్తి సంపాదించాడు కదా! ఇక స్వంత భార్యకోసం ప్రాణత్యాగం చేయుట పతికి న్యాయమూ ధర్మమూ కదా!
ఇక అర్ధరాజ్యమీయటం పెద్ద త్యాగమా? నేను చేసిన పని యెంతో సమంజసం నాయనా! నీ తండ్రి తొందరపాటు పనులు చేయడు. నీవు కాదంటావనే నేను ఈ వ్యవహారమంతా అతి గోప్యంగా వుంచా నన్నాడు. మందహాసం చేసిన మణికంఠుడు “తండ్రీ! నన్ను ప్రజలంతా పిరికి వాడిగా పరిగణించరా? ప్రజల నమ్మకం కోల్పోయిన రాజు పాలనకనర్హుడు”
కం|| నువు చేయలేని కార్యము
అవునా ధర్మంబు పరుల కర్పించుటయున్, ఎవనికి సాధ్యము అంచని
అవనిన్ తగదీ నిరాశ అవనీనాధా!
తా॥ భూపతియైన ఓ తండ్రీ! నీవు చేయలేని ప్రాణాంతకమైన పనిని 'పరుల’ చే చేయించుట న్యాయమా? ఈ పని నెరవేర్చలేమని నిరాశ తగదు. మీ కొడుకుగా మీబదుల నేనీపనిని సాధిస్తాను.
నా సామర్ధ్యంపై మీరు సందేహాలు పెట్టుకోవద్దు. నేనీపనిని సాధించగలను. మీరీ విధంగా కన్నీరెందుకు పెట్టుకుంటున్నారో నాకర్ధం కావటం లేదు. 'వావరు' అనే ఆటవిక రాజు దౌర్జన్యానికి దిగి భీభత్సం సృష్టిస్తుంటే నేను వెళ్ళి అతనిని నా పాదాక్రాంతుని చేసుకుని ఆటవిక న్యాయం పరిత్యజించి సన్మార్గంలో పడునట్లు చేశాను. గుర్తుకు తెచ్చుకోండి.
బందిపోటు దొంగల నాయకుడు మన ప్రధాన మంత్రి అండదండలతో భీభత్సం సృష్టిస్తుంటే అమ్మగారు నన్ను ఆయుధం పట్టవద్దని నా ప్రాణాలు కాపాడుటకు నాదగ్గర మాట తీసుకుంటే
ఉ॥ 'వావరు' నాకు తోడువడె బాధ్యత బూనుచు
వారిద్రోల తాన్
జేవనుబొంది నావలన జేయుట ఖడ్గపు సాము
భావన జేత మిత్రుడయి పారగ ద్రోలెను
నేర్చెనన్
ముష్కరాళినిన్
నీవను కొన్నరీతి నను నేడు తలంచకు బాలు
నంచనిన్
తా॥ వావరు (వావర్) ఆ సమయంలో బాధ్యతాయుతంగా నాకు తోడపడి ఆ దారిదోపిడీ దొంగలను పారద్రోలాడు. ఇదివరకు నావలన అతను సమర్ధవంతంగా కత్తిసాము నేర్చుకొన్నాడన్న విశ్వాసంతో అతనాపని చేశాడు. నామిత్రుడు
అయ్యాడు. కనుక ఇంకా నన్ను చిన్నపిల్లవాడని తలచవద్దు తండ్రీ!
తండ్రీ నీకు నేను చెప్పవలసిందేముంది? అశాశ్వతమైన దేహం కోసం అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని మృత్యువుయొక్క దారుణ కోరలకు బలిచేయతగునా? కొడుకు చేయవలసిన పని ఇదేనా? తల్లి ఋణం దీర్చుకోవటం అంటే ఇదేనా? ఎంత అన్యాయం!
ఆ॥ కొడుకు వలయునంచు కోటి నోములు నోచి కూడబెట్టి ధనము కొడుకుకిచ్చి
వాని కొరకు సుఖము వదలెడి తలిదండ్రి కేమి చేయగలము ఇదియు గాక!
తా॥ కొడుకు పుట్టాలని కోటి నోములు నోచి, ధనము పోగేసి కొడుకు కిచ్చి, వాడి కోసం తమ సుఖాన్నే వదులు కొనే తల్లిదండ్రులకు ఇదిగాక మరేమి చేయగలం, తండ్రీ
అని ఎంతో నచ్చచెబుతున్న కొడుకుని జూచి రాజు ఇక తప్పదని గ్రహించి కొడుకు అడవి ప్రయాణానికి కావలసినవన్ని స్వయంగా దగ్గిర వుండి ఏర్పాటు చేశాడు. రెండు అరలుగల నీలం రంగు (మాసిపోని రంగు) సంచీలో ఒక అరలో భగవంతుని కొరకు నివేదనా వస్తువులు, రెండవ అరలో యాత్రలో ఉపయోగించే సామాగ్రి, తినుబండారాలు కట్టి ఆ సంచీని మణికంఠునికి ప్రేమగా ఇచ్చాడు.
ఆ మూటనే ఇరుముడి అంటారు. ఆ ఇరుముడిని శిరస్సుపై ధరించి అడవిలో ఒంటరిగా ప్రయాణించాడు మణికంఠుడు. ఎరుమెలి అనే ప్రాంతం చేరుకోగానే ఒకనాటి తన మిత్రుడు వావర్ గుర్తుకు వచ్చి వావర్ నివాస స్థానానికి వెళ్ళాడు. | అతనిని సాదరంగా ఆహ్వానించిన వావర్ ఆరాత్రి స్వామికి (దీక్ష వహించిన మణికంఠుడు స్వామి అయ్యాడు).....
ఉ॥ మిత్రుని కోర్కెపై అచట మించిన సంతస మంది
స్వామియున్
చిత్రమదైన రీతి తను స్నేహితునిన్ అలరించె
నాట్యమున్
మిత్రుని తోటి జేసి, తన మిత్రుడు కేకలు
వెట్ట తాను ఏ
మాత్రము జంకులేక, అటు వావరునిన్ కరుణించె
నంతటన్
తా॥ స్వామి కూడా తన మిత్రుడైన వారికి కోర్కెపై గొప్పసంతోషంతో చిత్రముగా వానితో నాట్యం చేసి అతనికి ఆనందం కలిగించగా అతను ఏమాత్రం
జంకుగొంకు లేకుండా కేకలు పెట్టి ఉప్పొంగిపోయాడు. దీక్షలో ఉన్నా స్వామి అతని నా విధంగా కరుణించాడు.
మరునాడు వావరు తనూ వస్తానని యెంత వేడుకున్నా వినకుండా, ఎవరి కర్తవ్యం వారే నెరవేర్చాలని చెప్పి, వానివద్ద సెలవు తీసుకుని మణికంఠుడు అరణ్యంలో తన ప్రయాణం
కొనసాగించాడు. ఆ విధంగా కరుణించబడ్డ వావరు స్వామి, సన్మార్గంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ వావరు స్వామియై 'ఎరుమిలి' లో నేటికీ పూజలందు కుంటున్నాడు.
అక్కడనుండి ప్రయాణం సాగిస్తున్న మణికంఠునికి ఆకాశం నుండి ఆర్తనాదాలు వినబడి పైకిచూశాడు.
మ|| కనియెన్ ఆ మణికంఠుడంత తను ఆకాశంబు
వీక్షించగా
వినువీధిన్, అతిక్రూర వర్తనమునన్ వేదించి
ఆదిత్యులన్
పెను కష్టంబుల వెట్టు, అమ్మహిషితో పీడింపు
తామోర్చుచున్
మనలే మంచని వేడు కొంచు తనకై ప్రార్ధించు
అవ్వారలన్.
తా॥ఆమణికంఠ స్వామి ఆకాశం కేసి చూచాడు. అప్పుడాయనకు గగనంలో అతి దుర్మార్గురాలై దేవతల నందరిని బాధించుచూ గొప్ప కష్టములు కలిగించుచున్న దీనంగా వేడుకొంటున్న దేవతలను
చూచాడు.
ఓ హరిహరనందనా! ఎక్కడున్నావయ్యా? శివకేశవులు
మాకు చేసిన వాగ్దానాలన్నీ నీటి మూటలేనా? ఓటి మాటలేనా? ఇంకా ఎంతకాలం ఈ హింస? ఆనాడు శ్రీహరి ఆది కూర్మమై మందర పర్వతాన్ని మోసింది పరమ శివుడు గరళం తాగింది, అమృతం లభించక మోహినీ అవతారంలో రాక్షసుల ముందు హోయలు కురిపించిందీ ఇందుకేనా? కనీసం ఆ అమృతం త్రాగక పోతే 'చావ' న్నా మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించేది కదా? ఇప్పుడు మా గతేమిటి? అని మొత్తుకుంటున్నారు.
కం|| కరిగెను హృదయము స్వామికి
అరిగెను వినువీధి సీమ కాతృత జెందెన్
తరిగెను ఆయువు మహిషికి
పెరిగిన పాపాలకంతు విభుడందించెన్.
తా॥ ఆ దృశ్యంచూచిస్వామి మనస్సు కరిగి, ఆతృతతో ఆకాశంపైకి చేరాడు. ఆ మహిషికి ఆయువు తీరిందని గ్రహించి ఆ ప్రభువు దాని పాపాలకు ముగింపు పలికాడు.
తన జన్మకారణం నెరవేరే సమయం వచ్చిందని గ్రహించిన మణికంఠుడు మహిషి నెదుర్కొన్నాడు. స్వామిని బాలునిగా తలచి వికటాట్టహాసం చేసిన మహిషిని చిత్రహింసలకు | గురిచేసి దానితో ఘోరయుద్ధం చేశాడు మణికంఠుడు. చివరికి
దానిని సంహరించి,
ఆ॥ బంతివోలె దాని బట్టి చేతులనెత్తి గిరగిరమని దాని క్రిందనేయ బొంగరంబు వోలె పుడమిపై పడిపోయి అసువు లొదిలె మహిషి అసురకాంత.
| తా॥ మణికంఠస్వామి ఆ మహిషిని చేతులతో బొంగరంలా త్రిప్పి బంతిలా నేలకేసి కొట్టాడు. అసురకాంతయైన ఆ మహిషి ఆకాశంనుండి భూమిపై వేగంగా
పడిపోయింది.
(మహిషి దేహం పడిన స్థలం ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో నున్న పడమటి కనుమలలోని 'అళుదా' అనే ప్రాంతం.
ఆనాటి మహిషి శరీరమే నేడు 'అళుదామేడు' గా రూపము నొందింది. మహిషి కాలి గిట్టలు 'ఎరుమేలి' వరకు | వ్యాపించెను)
ఆమె దేహం ఆ విధంగా భూమిపై పడగానే........ ఆ॥ నింగినుండి దుమికి నేరుగా మహిషిపై తాండవంబు నాడె తాను స్వామి
ఇలకు జేరి తాము ఈశుండు గిరిజయున్
నందిపైన, జూచి నారు దాని.
తా॥ మణికంఠస్వామి ఆకాశంమీదనుంచినేరుగా ఆ మహిషిపై దుమికి కోపంతో తాండవనృత్యం చేశాడు. ఆనృత్యాన్ని పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరునిపై కూర్చొని తిలకించారు.
భూమిపై నిర్జీవంగా పడియున్న మహిషి దేహం స్వామి పాదస్పర్శతో పునర్జీవితం పొంది జ్ఞానోదయం కలిగి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చింది.
| పూర్వజన్మలో ఆమె మహాముని పుత్రిక లీలావతి. గొప్ప | సౌందర్య రాశి. దత్తాత్రేయుడు ఆ ముని ప్రియ శిష్యుడు. అందగాడే గాక సుగుణాల ప్రోవయిన దత్తాత్రేయునిపై ఆమె మరులుగొన్నది. అది జూచి ముని ఆమెను వారించి 'పుత్రీ! | బ్రాహ్మణ బాలికకు విద్యా సముపార్జన జరుగు సమయమున | వివాహవాంఛ కలుగరాదు. తగు సమయమున నీతండ్రినైన నేనే నీ పరిణయం చేస్తాను. తొందరపడుట నీవంటి ముని బాలికకు తగదు అని వారించాడు. దానికామె మధుర వేదనతో ఇలా అన్నది.
సీ॥భుజియించవలెనన్న భోజనంబే నాకు రుచియించదో తండ్రి! రోతబుట్టె పఠనంబులన్నియున్ బాధగా మారెను మనసు నిలువదాయె దేనిపైన
పూమాలలన్ గట్టబోతే కుదరదాయె
పూలవాసన మది పులకరించె
కలనైన ‘దత్తుడే’ కనిపించుచుండెను ఒడలంత సెగలాయె ఓపలేను
తే॥ పూజపై ధ్యాస నిలువక నుంటి నేను నిదుర పట్టదు రేయంత నిలిచిపోయె నన్న రీతిని వేదన అధికమాయె
పరిణయమె నాకు ఇప్పుడు మందు తండ్రి!
తా॥ ఓ తండ్రీ! తినాలంటే నాకు తిండి సహించుటలేదు. చదువు కూడ బాధాకరంగా మారింది. దేనిపైనా మనస్సు నిలుచుటలేదు. పూలమాలలు కట్టాలంటే సాధ్యమగుటలేదు. పూలవాసనకు మనస్సు ములకరిస్తోంది. మాలమాలలు కట్టాలంటే సాధ్యమగుటలేదు.షూలవాసనకు మనస్సు పులకరిస్తోంది. కలలో కూడా దత్తాత్రేయుడే కనబడి ఒళ్లంతా సెగగా మారింది. పూజ పై ధ్యాన నిలుచుటలేదు. నిద్రపట్టక రాత్రి నిలిచిపోయి నట్లుంటుంది. నాబాధకు వివాహమేమందు.
ఆమె ధైర్యానికి నీతి బాహ్య సంభాషణకి ఆ మునికి నోట మాట రాలేదు. బలవంతాన కోపం నిగ్రహించుకొని తండ్రి శిష్యుడు, గురు పుత్రికి సోదరునితో సమానం.
గురుకుల వ్యవస్థకు మచ్చతేకు. మన పరువు మంట కలుపకు " అన్నాడు.
ఆమె నిర్లజ్జగా తండ్రీ! నేను చేసిన నేరం ఏమిటి? దత్తాత్రేయుడు నాకు ఈడైనవాడు, అందగాడు విద్యాపారంగతడు, సౌమ్యుడు, పైపెచ్చు నా మనసు | దోచినవాడు. ఇది ఏమీ అనాచారం కాదే? తొల్లి | శుక్రాచార్యుని పుత్రిక దేవయాని కచుని వరించలేదా?
ఆ॥ ఏక గర్భ జనితులిరువురి కలయిక
మేలు కాదు కాని ఇలను నరులు
వేరు వేరు ఇంట వెలసిన దోసమే!
గురుడు మామ అయిన కులము చెడునె?
| తా॥ తండ్రీ ఒకేకడుపున బుట్టిన అన్నాచెల్లెళ్ల పరిణయం ధర్మవిరుద్ధం. ఒప్పుకొంటాను. అది మంచిదికూడ కాదు. కాని భూమిపై పుట్టిన మానవులు వేరు వేరు కుటుంబాలలో పుట్టి వివాహమాడితే తప్పేమిటి?
గురువుగారు మామగారఉ కాకూడదా?
| తండ్రీ! అదీగాక మనసు ఒకరికిచ్చి మనువు ఇంకొకరితో న్యాయమా? నేనుగాని నాకు మీరు యెంచిన మగడు కాని సుఖపడలేము. సుఖములేని రాత్రులు కాళరాత్రులు. భర్త సుఖములేని స్త్రీజన్మ నిరర్ధకము కదా! అన్నది.
ఆ మాటలకి తండ్రి నివ్వెరబోయి తరువాత కందగడ్డలా ఎర్రబడిన వదనంతో నిరసనగా ఛీత్కరించి
చం|| నలుగురు నవ్విపోదురిక నాదగు ఆశ్రమ విద్య
యంతయున్
కలియును నేటితో రగిలి గంగను దుర్మతి!
వ్యర్ధురాల! నీ
పలుకులు ముల్కులై మదిని బాధను వెట్టెను సిగ్గు లేదొకో
నిలిచితి విచ్చటన్ మహిషి నీవెయనన్
తగు జన్మనీకదే.
తా॥ ఓ చెడుబుద్ధిగల పనికిమాలినదానా! ఈ మాటవిని నలుగురఉ నవ్విపోరా? నా ఆశ్రమ విద్య అంతా నేటితో బూడిదై గంగలో కలిసిపోయింది. నీమాటలు ములుకులవలె బాధిస్తున్నాయి. నీకు సిగ్గులేదా? మహిషి (గేదె) వలె ఇంకా నిలబడ్డాడే పోపో నీకు మహిషి జన్మకలుగుగాక!
ఆ విధంగా మహిషియై కరంబునికి జన్మించిన లీలావతి, మణికంఠస్వామి అనుగ్రహించే శాపవిముక్తి పొందినది. ఆమె తను చేసిన అకృత్యాలను తలచుకొని కన్నీరు మున్నీరయింది. ఆమె కన్నీరే అళుదానదిగా మారి ప్రవహిస్తోందని పురాణ కథ చెబుతున్నది. పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో కాని పోదు అన్నట్లు ఇంత జరిగినా లీల, | ఆ మణికంఠస్వామిని జూచి
కం॥ చిత్తజు బోలిన స్వామిని
అత్తరి ఆ లీలగాంచి అనిమేషతనై చిత్తమునందున మురియుచు
మెత్తగ తను బల్కెసిగ్గు మించిన గతితో
తా॥ మన్మధునివంటి అందగాడైన స్వామిని చూచి లీల రెప్పవాల్చనిదై చూచి లీల రెప్పవాల్చినిదె చూచి మనస్సులోనే సిగ్గు ముంచుకు వస్తుండగా మృదువుగా
ఇలా పలికినది.
ఓస్వామీ! ఇంతటి అద్భుత సౌందర్యం నేనెన్నడూ చూడలేదు. మన్మధుడు ఇలాగే ఉండేవాడేమో. నాకు శాపవిముక్తి కలిగించి పునర్జన్మనిచ్చారు. నన్ను పరిణయ మాడి నన్నుద్ధరించండి. మీకు అమర సుఖాలందిస్తానంది. దానికి స్వామి చిరునవ్వుతో, ఓ లీలా! ఇంత జరిగి నీవు | వ్యామోహం వీడలేకున్నావేమి? నీ అమాయకత్వానికి నవ్వు వస్తోంది, జాలి కలుగుతున్నది. ఈ అవతారమున నేను అస్ఖలిత బ్రహ్మచారిని, ధర్మశాస్తను. కఠోర దీక్షా దక్షుడను. నా వివాహము అసంభవము.
ఉ॥ కన్నుల నీరు కమ్మి తను గద్గదయై అనెనింతి
యంతటన్
మన్నన కోరుదాన ప్రభు! పాదములంటెద
తప్పుకాయుమా
సన్నుతి జేసి వేడెదను స్వామివి గావుము, నిన్ను
భక్తితో
అన్ని వికారముల్ విడిచి అర్చన జేసెడి భాగ్య
మీయుమా
తా॥ లీల తన గొంతు గద్గదమై కన్నులు వర్షిస్తుండగా మణికంఠస్వామితో ఇలా అన్నది. ప్రభూ! నన్ను క్షమింపుము నీ పాదములను తాకి నమస్కరించి, నిన్ను భక్తితో ప్రార్ధిస్తాను. నాకు నిన్ను వికార రహితనై కొలిచెడి భాగ్యము నిమ్ము.
| స్వామి ఆమె పశ్చాత్తాపానికి సంతోషించి, శబరిమలైలో తనను గొలుచుటకు వచ్చు భక్తులందరూ "మాలికాపురత్తమ్మ” లోక మాతగా ఆమెని పూజించెదరని వరమొసంగి కరుణించారు. మహిషి అంతరించగానే పెద్ద తుఫాను వచ్చి
వెలిసినట్లు భూలోకం ప్రశాంతిని పొందింది. ఎక్కడ జూచినా | పండుగ వాతావరణం నెలకొంది. ఋషులు మునుపటి వలె వేదాధ్యయనం వేద బోధన మొదలెట్టారు. మునులు | సంతోషంగా తపస్సు కొనసాగిస్తున్నారు.
స్వర్గలోకాన్ని మహిషి పీడనుంచి విముక్తి చేసిన మణికంఠుడు దానిని తిరిగి దేవతలకొప్పగించి దేవేంద్రుని తిరిగి దేవలోకాధిపతిని చేశాడు. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో దేవతలు మణికంఠుని వేనోళ్ళ కీర్తించారు. దేవేంద్రుడు మణికంఠునితో ఇలా అన్నాడు....
స్వామీ! మీ ఈ దీక్షావస్త్రములేమిటి? ఈ ఇరుముడి ఎందుకు ధరించారు? ఎక్కడికెళ్తున్నారు?
దానికి మణికంఠుడు తన కథ అంతా వివరించి
ఆ॥ తల్లిగారి వ్యాధి తగ్గుటకై పులి
పాలు వలయునంచు వైద్యులనగ నేను దీక్షబూని వనికేగుదెంచితి
దారి తెలుపవయ్య ధన్యుజేసి.
తా॥ దేవేంద్రా! నా తల్లి గారి వ్యాధి నివారణకు పులి పాలు కావలెనని వైద్యులన్నారు. అందుకై నేను దీక్షపట్టి వనములలొచ్చాను. నాకు మార్గం చూపి ధన్యుణ్ణి చేయుము.
దేవేంద్రుడు స్వామితో ఇలా అన్నాడు.
పులి పాలుపిండనిస్తుందా? ఒకవేళ పిండనిచ్చినా అవి తిరిగి మీరు మీ స్వస్థానం చేరేదాకా ఇగిరిపోకుండా ఉంటాయా? ఉన్నా, పులిపాలలో కలిపే ఔషధం వుంటుందా? ఉన్నా, ఆ వ్యాధి ఇంకెవరికీ ఇదివరలో రాలేదా? వారేం చేస్తారు. ఇదంతా పెద్ద పన్నాగంలా ఉన్నది.
ఆ॥ ఏది అయినగాని, ఈవె దానిని గోర స్వర్గమైనదించి చనెద నేను
వ్యాఘ్రమౌదు స్వామి మణికంఠ నీవెంట వచ్చి భువికి నీదు పనిని దీర్తు.
తా॥ ఓ మణికంఠా! నాకింత ఉపకారం చేసిన నీకోసం ఏమైనా చేస్తాను. నీవు కోరితే స్వర్గమైనా మీ భూమి పైకి
దించగలను. నేనే వ్యాఘ్రమై నీతోబాటు మీ రాజ్యానికి వచ్చి నీ పని నెరవేరుస్తాను.
ఆ మాట అంటూనే సురలోకాధిపతి బెబ్బులిగా మారిపోయాడు. యధారాజా తథా ప్రజా అన్నట్లు దేవతలంతా పులులుగా మారిపోయారు. దేవేంద్రుడు మణికంఠుని తనపై నెక్కించుకొని భూలోకానికి దిగివచ్చాడు. పందల రాజ్యం చేరుకుని రాజధాని వీధుల్లో ఆ వ్యాఘ్ర సైన్యం నడుస్తుంటే....
కం|| బెబ్బులి మూకను జూచిరి
తబ్బిబ్బై పారిరంత దశ దిశలకు, ఓ
రబ్బో! ఇదేమి జరిగెను
అబ్బురమీ పులుల సేన అరుదెంచె నిటన్
తా॥ ప్రజలంతా ఆపెద్ద పులుల మందను జూచి భయవిహ్వలులై పారిపోమారు. “ఓరి నాయనో! ఇదేం జరిగింది? ఈ పెద్దపులుల సైన్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అని ఆశ్చర్యపోయారు.
ఆ విధంగా తండ్రిని చేరుకున్న మణికంఠుడు పులిపై నుంచి దిగి తండ్రికి నమస్కరించి తమకు కావలసినన్ని పులిపాలు తీసుకొమ్మని జెప్పెను. రాణి, ప్రధానమంత్రి స్వామి | పాదములపై బడి క్షమాభిక్ష వేడుకున్నారు. ఆ పులుల సేనను పంపించి వేయమని వేడుకున్నారు. చిరునవ్వుతో స్వామి ఆన తీయగానే దేవేంద్రాది దేవతలు యధారూపం ధరించి వారందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. మణికంఠుడు | తనని కౌగలించుకొని దుఃఖిస్తున్న తండ్రితో ఇలా అన్నాడు...
| తండ్రీ! ఏమిటీ బేలతనం? పదిమంది దుఃఖ నివారణ చేయ సమర్ధులైన తమరు చిన్న పిల్లవానివలె విలపిస్తున్నారా? నేనెక్కడికి పోతాను. సదా మీ హృదయంలోనే వుంటాను. ఈ పందళ రాజ్యం నాకు తల్లివంటిది. ఈ అడవుల్లో పుట్టిన నేను ఈ అడవుల్లోనే అవతారం ముగిస్తాను. నన్ను బిడ్డగా పెంచిన నీ దేవేరి నాకు దేవత.
ఉ॥అమ్మకు వందనంబులివె ఆమెయె దైవము నాకు
యెన్నడున్
ఇమ్మహినేల సాయమగు ఎప్పటి వలెనె నాదు
స్నేహితుల్
తమ్ముని రాజు చేయుమిక, ధ్యానసమాధిని నిల్వు
మయ్యరో!
సమ్మతినిచ్చి పంపు నను స్వామిని అయ్యప
నౌదు వల్లభా!
తా॥ తండ్రీ! అమ్మకు నా వందనములు. ఆమెయే నాకు దైవము. నాస్నేహితులందరూ రాజ్యపాలనలో తోడుగా ఉంటారు. ఇక నువ్వు ధ్యాన సమాధి నభ్యసిస్తూ జీవిత శేషం గడుపుము. నాకు నీ అనుమతి నిచ్చి పంపితే అయాప్ప స్వామినై ప్రజలకు ఇలవేల్పునవుతాను.
తండ్రీ! ప్రతి మకర సంక్రాంతినాడు నేను జ్యోతి రూపుడనై పందళ వినువీధిలో దర్శనమిస్తుంటాను. నాకీ స్వర్ణాభరణముల ఆవశ్యకత లేదు. ఆ విధంగా చెప్పి
కం|| తన మొలలో చురకత్తిని
ఘనుడా అయ్యప్ప స్వామి గైకొని విసిరెన్ అనువుగ శబరిమలైలో
వెనువెంటనె కత్తి పడెను విభుడిట్లనియెన్
| తా॥ ఆయ్యప్ప స్వామి తన మొలలో నున్న చురకత్తిని తీనికొని విసిరాడు. వెంటనే ఆకత్తి శబరిమలైలో ఒకచోటు పడింది. అప్పుడు. స్వామి ఇట్లనైను.
తండ్రీ! మీరంతా ప్రేమగా నన్ను అయ్యా! అప్పా! అని పిలుస్తూ నన్ను ఇక్కడే వుండి పొమ్మని వేడుకుంటున్నారు. | కనక నా చురకత్తిపడిన ఈ శబరిమలైలో నేను కొలువుదీరి
ఉంటాను.
నన్ను చేరు దారిలో కాలి నడకతో పాదరక్షలు విసర్జించి | మండలం రోజులు దీక్షా వస్త్రాలతో దైవ ధ్యానంలో గడుపుతూ | ఈ నా తావుకి కఠోర దీక్షతో వచ్చిన వారికి నా పదునెనిమిది సోపానములు (18 మెట్లు) ఎక్కి నన్ను చూచిన వారికి,
నేను ప్రసన్నుడనై అభీష్టములు తీరుస్తాను. మకర సంక్రాంతి నాడు నన్ను జ్యోతి రూపునిగా చూడగల ధన్యులకు మోక్షం | ప్రసాదిస్తాను. అయితే ఆ 18 నియమాలూ పాటించే దీక్షలో సడలింపు వస్తే మాత్రం మోక్షం దుస్సాధ్యం.
ఈ విధంగా చెప్పిన అయ్యప్ప స్వామి పంబనది దాటి శబరిమలై చేరి శ్రీరామచంద్రుని కాలం నాటి శబరికి మోక్ష ప్రాప్తి కలుగ జేసి శబరి పీఠం నెలకొలిపారు. 'ధర్మశాస్త్ర' అవతారమైన అయ్యప్పస్వామి మణికంఠునిగా అందరినీ అలరించిన ఆ స్వామి దీక్షాబద్ధుడు దీక్షా ప్రియుడు. కోటీశ్వరుడైనా కూటికి లేని వాడైనా, పండితుడైనా, పామరుడైనా స్వామి కోరేది అనన్యభక్తి.
ఆ॥ దీక్షబట్టు వారు ధీరులు గురువులు జ్యోతి శ్రమల కోర్చి జూచు వారు ధన్య జీవులనుట తగును సత్యంబది జన్మ సఫలమౌను స్వామి కరుణ
తా॥ దీక్షబట్టు వారు ధీరులు. గురు స్వాములు. శ్రమల కోర్చి జ్యోతి రూపుడైన అయ్యప్ప దర్శనం చేసికొన్న వారు ధన్యజీవులు మాట నిజం. స్వామి దయ వలన వారి జీవితం సఫలమవుతుంది.
| అయ్యప్ప స్వామి కథ తెలిపిన రకరకాల పుస్తకములలో గల వ్యత్యాసముల వల్ల, ఏది ఇదమిద్ధంగా ప్రామాణికమో ఏది కాదో తెలుసుకొనుట అంత సులభ సాధ్యము కాదు. రామాయణ కథనే రకరకాలుగా మార్చి చెప్పుకుంటున్న | మనదేశంలో అయ్యప్ప కధలో కొన్ని మార్పులుండడం | సహజమే. ఏది సరియైనది? ఏది కానిది? తెలుసుకోలేం. అందుకని అనవసరమైన తర్క వితర్కాలు మాని ఒక్కసారి స్వామియే..... శరణమయ్యప్పా..... శరణం శరణం స్వామి శరణం..... శరణం శరణం అయ్యప్ప శరణం.
చం|| తికమక బెట్టు యోచనల దేలక చెప్పెడి మాట
నమ్ముడీ
‘మకర వెలుంగు' సామి అసమానుడు అయ్యప
ఆ మహామహున్
ముకిళిత హస్త యుగ్మముల మ్రొక్కుచు అయ్యప గాధ తెల్పితిన్
సకల జనాళి మెచ్చ నను, స్వామికి పూజను
భావనంబుతో
తా॥ ఏవో తికమక పెట్టే ఆలోచనలలో పోక నేను చెబుతున్న సత్యం వినండి. నన్ను నమ్మండి. అయ్యప్ప మకర జ్యోతి రూపంలో నున్న దేవుడు. చేతులు జోడించి ఆయనకు మనసారా మ్రొక్కుచు ఈఅయ్యప్ప స్వామమి చరిత్ర చెప్పాను. స్వామికి ఇది నా పూజ అనే నా భావన. భక్త జనులంతా దీనిని మెచ్చెదరు గాక!
సీ॥ మొండికత్తితొ యెట్లు ఖండించ సాధ్యంబు? మంట లేకుండిన వంటయెట్లు?
తా॥
గురిలేని వానికి కూడునే విలువిద్య? బలహీనుడెట్లాను మల్లయోధ?
పూని శుభ్రత లేక పూజ జేయుట యెట్లు? నారి నమ్రత లేక పరువు పోదె? ఆర్జన లేని వాడవబోడె వ్యర్ధుండు? మాట వినని బిడ్డ చేటుకాదె?
ఓ అమరవాదీ!
మొండి కత్తితో దేనినైనా ఖండించ గలమా? మంటలేకుండా వంట చేయ సాధ్యమా? గురి పెట్టలేని వాడికి విలువిద్య వస్తుందా? బలహీనుడు మల్లయోధుడవగలదా? శుభ్రత లేక పూజ సాద్యపడుతుందా? స్త్రీ అణకువ లేనిదైతఏ పరువు పోదా? ఆర్జనలేని పురుషుడు వ్యర్థుడవడా
మాటవినని సంతానం చేటుతేరా? భక్తిలేని వానికి భగవద్దర్శనం అవుతుందా? దీక్షబట్టక అయ్యప్పను తెలుసుకోగలరా? ఎన్నడైనా పట్టుదలలేక పని జరుగుతుందా?
"స్వామియే..శరణం అయ్యప్పా!”
ఆ॥ భక్తి లేని వాడు భగవాను జేరునా? దీక్షలేక ప్రభును తెలియగలరె? పట్టుదలయె లేక పని సానుకూలంబు అవునె ఎన్నడైన? అమరవాది!
స్వామి అయ్యప్ప అభిషేకములు - వాటి ఫలితములు
పాలు అభిషేకము
పెరుగు అభిషేకము
అభిషేకము - ఫలితము
కొబ్బరి నీరు అభిషేకము
తేనె అభిషేకము
పానకం అభిషేకము పంచామృతాభిషేకము శుద్ధోదక స్నానం
(గంగా జలం)
-
—
-
మంచి పేరు ప్రతిష్ఠలు
వంశము వృద్ధి చెందుతుంది
మంచి బుద్ధులు, సత్పుత్రులు
శాస్త్ర జ్ఞానము
సంకల్ప సిద్ధి
-
దీర్ఘాయువు
అశ్వమేధ యాగఫలం
కుంభజలం అభిషేకము - మనశ్శాంతి, భక్తి ముక్తులు
(కలశజలం)
ఆవునెయ్యి అభిషేకము
—
ఐశ్వర్యం, మోక్షము, అభివృద్ధి
గంధాభిషేకము
భస్మాభిషేకము | పన్నీరు అభిషేకము
-
—
పుత్రలాభం, స్వర్గభోగము
మహాపాపనాశనము
ఋణవిముక్తి
| వలంపురి శంఖు అభిషేకము - రోగనాశము, ఆరోగ్యవంతులగుట
| సహస్రధారాభిషేకము
-
ధనలాభము
అన్ని రకాల ఫలాలు
-
శుద్ధాన్నం
వ్యవసాయ అభివృద్ధి, శత్రుజయం దేహకాంతి, సర్వతీర్థ స్నానఫలము
(పగలు మాత్రమే)
| అన్ని రకముల పుష్పములు - కుటుంబ ఆనందం, పాప నివృత్తి
| నవరత్నాలు అభిషేకము
గ్రహదోష నివారణ, శాంతి
రజిత అభిషేకము
—
వస్త్రములు
-
జ్ఞానము, శాంతి, పొన్నంబలలో స్వామిని అభిషేకించిన ఫలితం రాజయోగము, ఆత్మశుద్ధి
అయ్యప్ప స్వామి వ్రత దీక్షా నిబంధనలు
* ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాలకృత్యములు తీర్చుకొని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయవలెను.
★ రోజూ ఉదయమూ, సాయంత్రమూ ఏదో ఒక దేవాలయమును సందర్శించవలెను.
నల్లని దుస్తులను కానీ, నీలిరంగు దుస్తులు కానీ
ధరించుట పరిపాటి. (యాత్రా సమయమున తప్పక ధరించవలెను)
కాళ్ళకు చెప్పులు లేకుండా నడచుట అలవాటు చేసుకొనవలెను.
ఎట్టి సమయములో కూడా మెడలో ధరించిన ముద్రమాలను తీసివేయరాదు. పరిశుభ్రతను అన్ని వేళలయందు పాటించవలెను. నిత్యము కర, పాద, నేత్ర ప్రక్షాళనము చేయుచుండవలెను.
దీక్షా కాలమందు ముఖక్షవరముగాని, కేశ ఖండన గాని పనికిరాదు. గోళ్ళను కూడా తీయరాదు. అస్ఖలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటియందు ఒక వేరుగదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్య జీవితము, మనోవాక్కాయ
★ కర్మములందు తలచుట కూడా ఘోరమైన
అపచారము.
మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. సంసారమునకు వాడిన దుప్పట్లు సహితము వాడరాదు. వీలైతే కొత్తబట్టలు వాడుట శ్రేయస్కరము. నేలమీద కొత్తచాప పరచుకొని పరుండుట ఉత్తమము. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి వారి శరణువరోష చెప్పిన పిదపనే మంచినీరైనా త్రాగవలెను.
దీక్షలో నిత్యమూ అయ్యప్ప నామస్మరణము చేయుచూ
"స్వామియే
శరణమయ్యప్ప”
మూలమంత్రమును ఎప్పుడూ జపించవలెను.
అనే
★ దీక్షా సమయంలో స్త్రీలనందర్నీ (భార్య సహితము) దేవతా మూర్తులుగా భావించవలెను.
★ తమ నామధేయము చివర “అయ్యప్ప” అను పదము చేర్చవలెను. ఇతరులను “అయ్యప్ప” అని
★ సంబోధించవలెను. స్త్రీ అయ్యప్పలను “మాలికాపురం” లేక “మాత” అని పిలువవలెను. తను చేయు ప్రతికార్యమునందును అయ్యప్ప భగవానుని రూపమే తలపోయు చుండవలెను.
అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు)
పిలిచిన
ఎడల ఎట్టి పరిస్థితులలోను తిరస్కరించరాదు. జాతి, మత, కులభేదములు అయ్యప్పలకు లేవు. అయ్యప్ప దృష్టిలో అందరూ
సమానులే.
అయ్యప్పల నుదుట ఎప్పుడూ విబూది, చందనము, కుంకుమ బొట్టులతో విలసిల్లుచుండవలెను. మద్యము సేవించుట గాని, ధూమపానము చేయుటగాని, పొగాకు వంటివి ఉపయోగించుట గాని చేయరాదు. చివరకు తాంబూలము కూడా
నిషిద్ధమే.
రోజూ అతి సాత్వికాహారమునే భుజించవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను. అనగా ఏకభుక్తము మాత్రమే చేయవలెను.
మానవసేవ
-
మాధవ సేవయని గుర్తించి
ఇతరులకు తోచిన సహాయము చేయవలెను.
సాధ్యమైనంతవరకు నిత్యజీవన విధానమునకు,
లౌకిక వ్యవహారములకు అతి దూరముగా వుండవలెను.
* తరచు దేవాలయములు సందర్శించుట, సత్సంగము, భజనలలో పాల్గొనుట అత్యుత్తమము. స్వామి శరణుఘోషప్రియుడు, కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.
ఎదుటి వారిని తన మాటల చేతకాని, చేతల చేతకాని బాధించరాదు. హింసాత్మక చర్యలకు దూరముగా వుండవలెను.
అబద్ధమాడుట, దుర్భాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండవలెను.
ప్రతిదినము స్వామివారికి అర్చన, తరువాత ఇష్టదేవతలను ప్రీతికొలది ధ్యానించవలెను.
కేవలం మానవ జాతియందేకాక, మృగ, పశు, పక్ష్యాదులందు కూడా దయచూపుట చాలా
అవసరము.
అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు,
విద్య, అవిద్యలకు దూరముగా వుండవలెను. ఇదియే పదునెట్టాంబడి.
'అహం బ్రహ్మాస్మి' 'తత్త్వమసి' సిద్ధాంతములను అనుక్షణము అమలులో పెట్టవలెను.
శక్తి కొలది దీక్షా సమయంలో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయము, సాయంత్రము కూడ కర్పూర హారతి ఇవ్వవలెను. దీక్షా సమయములో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయములో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కాని దీక్షలేని ఇతరులకు చేయరాదు.
గర్వము, అహంభావము, ఆడంబరము వుండరాదు. సర్వమూ స్వామి సేవకే అంకితము కావలెను. పైన చెప్పబడిన నియమములు దీక్ష తీసుకొన్న ప్రతి అయ్యప్ప పాటించి తీరవలెను. పైన చెప్పిన నియమములే కాక ఇంకా కఠోర నియమములను ఆచరించే అయ్యప్పలు చాలమంది మనకి కానవస్తారు.
ఉదాహరణకు తెలిసిన కొన్ని నియమాలు ఇక్కడ పొందుపరచబడినవి :
దీక్షా సమయములో స్వయముగా వంట చేసుకొని మాత్రమే భుజించుట.
యాచక వృత్తిచేసి, వచ్చిన సొమ్ములతోనే భుజించుట, లేకపోతే పస్తులుండుట (కొందరు లక్షాధికారులు కూడా ఈ నియమం పాటించినట్లు తెలుస్తోంది) కనీసము రోజుకొక అయ్యప్పకైనా భిక్షపెట్టి తరువాత తాను భుజించుట.
★ కనీసపు అలవాట్లు కాఫీ, టీ వంటివి కూడా
విసర్జించుట.
★ రోజూ రెండు పూటలా అల్పాహారము (భిన్నాహారము) నే భిక్షగా స్వీకరించుట.
★ రోజూ భుజించే కంచములు విసర్జించి ఆకులలోనే భుజించుట. టూత్ పేస్టు, బ్రష్ వంటివి విసర్జించి వేప, గానుగ మొదలగు పుల్లలతో పళ్ళు తోముకొనుట, ఇంకా ఇలా ఎన్నెన్నో కఠోర నియమములు ఆచరించే అయ్యప్పలు కోకొల్లలు.
మాలధారణ మంత్రం
జ్ఞాన సముద్రాం శాస్త్ర ముద్రాం గురుముద్రం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాదుసదాపిమే | గురుదక్షిణ యాపూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేసరీ ముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
మాలధారణకు కావలసిన వస్తు సామగ్రి
1. బట్టలుః :- నల్లరంగు దుస్తులు రెండు లుంగీలు, రెండు షర్టులు, రెండు తువ్వాళ్ళు, (డ్రాయర్లు, బనియన్లు కావలసినవి) నల్లని దుప్పటి ఒకటి.
2. మాలః తులసిమాలగాని, రుద్రాక్షమాలగాని, గంధంమాలగాని, తామరమాలగాని, మీకు నచ్చినవి రెండు మాలలు కావాలి.
3. పూజకు కావలసిన సామాన్లు : కొబ్బరికాయ, అరటిపళ్ళు ఆరు, కర్పూరం, నువ్వుల నూనె 100 గ్రాములు, ఊదివత్తులు, కుంకుమ, విభూతి, చందనం డబ్బా, జీడిపప్పు, కిస్మిస్, పువ్వులు, పటికబెల్లం, పంచదార.
4. మీరు ముందుగా పైన చెప్పబడిన సామాన్లు గురుస్వామిగారి వద్దకు తీసుకొని వెళ్ళి మాలవేయుమని ప్రార్ధించాలి. తెల్లవారు ఝామున మీరు శిరఃస్నానం చేసిన తరువాత, తడిబట్టలతో అయ్యప్పస్వామి వద్ద మీరు తీసుకెళ్ళిన సామాన్లతో,
పూజచేసి తరువాత మాల మీ మెడలోవేసి, మిమ్ములను దీక్షకు ప్రారంభం చేయుదురు. వారి ఆశీర్వాదం పుచ్చుకొని మీ ఇంటికి గాని, ఆశ్రమానికి గాని ఈ దీక్షకు ప్రత్యేకించబడిన ఒక గదియందు (కడిగి, సున్నం వేసి, ముగ్గులు పెట్టి యున్నటువంటిది) రావలయును.
విఘ్నేశ్వరుని ఫోటో, అయ్యప్ప ఫోటో, కుమార | స్వామి ఫోటోలు పై విధముగా ఉంచవలెను. ఇతర దేవతల ఫోటోలు కూడా) మీరు ప్రతిదినం వేకువ జామున అనగా (సూర్యోదయమునకు పూర్వం) లేచి కాలకృత్యములు తీర్చుకొని, చల్లని నీటితో తలస్నానం చేయవలెను. చేసి, మీరు కట్టి విడిచిన బట్టలు తడివి, మడిగా ఆరవేసుకొనవలెను. క్రితం సారి తడిపి ఆరవేసిన బట్టలుగాని, | తడిబట్టలతోగాని మొదట నుదుట బొట్టు ధరించి, తరువాత దీపం వెలిగించి శరణుఘోష చెప్పవలెను. తరువాత అష్టోత్తర నామావళితో పూజ చేయవలెను. నైవేద్యం (అరటిపండుగాని,
మీకు తోచినదిగాని) పెట్టి, హారతి ముందు విఘ్నేశ్వరునికి, కుమారస్వామికి, అయ్యప్పకు వరుసగా ఇచ్చి సాష్టాంగ నమస్కారము, తదుపరి ముందుగా మీ మెడలో వున్న మాలకు హారతి ఇచ్చి, తరువాత హారతి తీసుకొనవలెను. మీరు ఇంటివద్ద పూజాకార్యక్రమము ముగించుకొని, మీకు నచ్చిన దేవాలయమునకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి, మీకు కలిగిన అల్పాహారం తీసుకొనవలెను. (ఉదయం కార్యక్రమం పూర్తి).
మధ్యాహ్నం తలస్నానం చేసి, మీకు కలిగిన సాత్విక
ఆహారం భుజించవలెను.
సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పై విధముగా స్నానం చేసుకొని, పూజా కార్యక్రమం ముగించుకొని, వీలైతే భజనలు చేసుకొని, రాత్రికి కూడా అల్పాహారం తీసుకొనవలెను. (రాత్రి 12 గంటలలోపు భిక్ష కార్యక్రమము పూర్తి చేయవలెను.)
ఉదయం తీసుకొనే ఆహారమును "భిక్ష" అని అంటారు. మధ్యాహ్నము తీసుకునే ఆహారాన్ని “చద్ది” అని
అంటారు.
ఈ విధముగా ప్రతిదినం చేస్తూ, కనీసం నలభై ఒక్క | దినములు దీక్ష పాటించవలెను. నలభై ఒక్క దినములు దీక్ష | పూర్తి చేయనివారు పడిమెట్లు ఎక్కుటకు అర్హత కలిగియుండరు.
స్వాముల వివరములు:
1వ సం|| కన్నెస్వామి
2వ సం|| కత్తిస్వామి
3వ సం|| గంటస్వామి
4వ సం|| గదస్వామి
5వ సం॥ పెరుస్వామి
6వ సం॥నుండి “గురుస్వామి" అని పిలుస్తారు.
ఈలోపు దీక్షలో కొంతమంది అయ్యప్పలు వారి ఇంటివద్ద |
పూజ చేయించదలచిన యెడల, ముందుగా పూజ మండపం
అరటి దొప్పలతో గాని, మామూలుగా గాని కట్టించవలెను. లేనిచో పటములు పెట్టి చెయ్యవచ్చును. తదుపరి అష్టోత్తరం |
పూజ, భజనలు, లింగాష్టకం, ఉయ్యాల పాట తదుపరి కర్పూర హారతి 18 ప్రమిదలతో కర్పూరం వెలిగించుట, తదుపరి స్వామికి సాష్టాంగంగా ప్రణమిల్లుట, వచ్చిన | స్వాములకు పాదనమస్కారములు, చద్ది ఏర్పాటు చేయవలెను. ఈ విధముగా పూజా కార్యక్రమము జరుగును.
పై విధముగా నలభై ఒక్కరోజులు దీక్షాకార్యక్రమము పూర్తిచేసుకొని, అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్ళుటకు | సిద్ధపడవలెను.
అయ్యప్ప స్వామి సన్నిధి దర్శన వేళలు
* ప్రతి సంవత్సరం జనవరి 6 నుండి 20వ తారీఖు వరకు “విళఖ్” పండుగ లేదా "జ్యోతి" దర్శనం.
* ఏప్రియల్ మాసములో “విష్” పండుగ. * ఆగష్టు మాసంలో “ఓణం” పండుగ.
* నవంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు మండల
పూజ. కన్ని అయ్యప్పలకు ముఖ్య సూచనలు
* కన్ని అయ్యప్పలు వ్యర్ధ ప్రసంగములు చేయుటకానీ, యాత్రలో ప్రశ్నలు వేయుటకానీ చేయరాదు.
* సీనియర్ అయ్యప్పలు, మార్గదర్శి అయ్యప్పలు చెప్పినట్లు యాత్రలో అనుసరించాలి. కానీ బృందాన్ని వదలి ముందుకు నడవరాదు. ఆ భక్త సమూహంలో తప్పిపోయినా గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది.
* ఇరుముడి నెత్తిపై పెట్టుకొన్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కానీ, వెళ్తున్నానని కానీ, కుటుంబ సభ్యులకు కానీ మరి ఎవ్వరికీ చెప్పరాదు. * ఇరుముడి శిరస్సుపై వుంచుకొని చిరుతిళ్ళు తినుట, లఘశంక వంటివి చేయరాదు.
* ఇరుముడిని కన్ని అయ్యప్పలు ఎట్టి పరిస్థితులలో దించుకొనరాదు. అవసరమైతే సీనియర్ అయ్యప్పలే ఇరుముడిని క్రిందకు దించుతారు. బృందంలోనివారు కాక యాత్రచేసే వేరే అయ్యప్పలెవరైనా సాయం చేయవచ్చును.
* కన్ని అయ్యప్పలలో భక్తితో మహత్తర శక్తి నిబిడీకృతమై వుండుట వలన ఉత్సాహముతో ఉరకలు వేయడానికి కానీ ఎట్టి
* మనసు ఆరాటపడుతుంది. పరిస్థితులలోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు. ఒకవేళ ముందు వెళ్ళినా వెనుక వస్తున్న వారికోసం నిరీక్షిస్తూ ఒక సురక్షిత స్థానంలో ఆగి వుండాలి. తినుబండారాలు ఏవైనా వెంట తీసుకొని వెడితే అయ్యప్పలందరకు పంచిపెట్టి తినాలి కానీ
దొంగచాటున తినరాదు.
* యాత్రాసమయములో స్వామి శరణుఘోష చెప్పుకొంటూ మాత్రమే నడక సాగించాలి. * ప్రకృతి సౌందర్యము గూర్చి కానీ, క్రూరమృగముల గూర్చి కానీ చర్చించరాదు. తలపునకు కూడా రానీయరాదు. మనసు అయ్యప్పపైనే లగ్నమై వుండవలెను.
* యాత్రలో వివిధ పుణ్య క్షేత్రములు, దేవాలయములు సందర్శించునపుడు బృందముతో కలసి దర్శనము చేయవలెను. కానీ వేరుగా పూజలు జరిపించరాదు.
* నిర్ణీత కాలములో గురుస్వామి ఆదేశ ప్రకారము నడువవలెను. భిక్షకు కూడా బృందముతోనే వెళ్ళవలెను. కానీ ఎవరి దారిన వారు వెళ్ళరాదు.
* అమితముగా ఎక్కడా భుజించరాదు. రాత్రులందు చీకటిలో లఘశంకకు, దీర్ఘశంకలకు దూరము పోరాదు.
* వార్తాపత్రికలు కానీ, దినపత్రికలు కానీ దీక్షలో చదువరాదు.
* కెమేరాలు, ట్రాన్సిస్టర్ వంటివి యాత్రకి తీసుకెళ్ళరాదు.
* స్నానము చేయునపుడు విలువయిన వస్తువులు, డబ్బు వగైరాలు బృందంలో బాగా పరిచయమున్న అయ్యప్పకిచ్చి వెళ్ళవలెను. దొంగలు సమయము కోసం వేచి వుంటారని మరువవద్దు.
* కన్ని అయ్యప్పలు ఒంటరిగా (బృందము లేకుండా) ఎన్నడూ యాత్ర సలుపరాదు.
సందర్శనీయ స్థలములు
1. యరిమేలి 2. వావరు స్వామి ప్రారంభం 3. పేటదర్ము సాస్త 4. శ్రీధర్మ సాస్త 5. పురివ్రేసే చెట్టు 6. శివకేసవ మందిరం 7. సుబ్రహ్మణ్యస్వామి మందిరం 8. భవానీ మందిరం 9. కాళికట్టు ఆశ్రమం 10. అలుదానది
11. అలుదా యెట్రం 12. ఇంజిపారకోట 13. ఉడుంబార కోట 14. కనన్దేవి ఆలయం 15. పెరియార్ (టైగర్ జోన్) 16. తాబలం 17. కరిమలం తోడు
18. కరిమల యెట్రం 20. కరిమల యరక్కం 21. సిరియాన వట్టం
22. పెరియాన వట్టం 23. పంబగణపత్తి 24. నిలిమల యట్రం
25. నిలిమల టాప్ 26. అప్పాచి మెడ్ 27. శబరి పీటం 28. శరన్ గుత్తి
29. అగ్నిగుండం 30. పదునెట్టాంబడి 31. అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
గురుస్వామి వివరించిన నియమాలు
1. 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయసుగల అమ్మాయిలు రావచ్చు. కాని వాస్తవముగా దేవుడు అనే రూపములు అతనియొక్క మహిమను గుర్తించేది 8 సంవత్సరముల తరువాతనే. అప్పుడే దైవత్వమును, భక్తిని, రూపమును మనసులో నిలుపుకునే అవకాశము | వుంటుంది.
2. తులని మాల ధరించటం వల్ల జ్ఞానము పెంపొందించబడుతుంది. శరీరములో వున్న రుగ్మతలు అనగా (ఎలర్జీ) లాంటివి తొలగును. మనసు దేవునిమీద లగ్నం చేయుటకు సాధనముగా వుంటుంది.
3. ప్రాతఃకాల స్నానము శుచిగడియలు ఉ. 3-5 చేస్తే శరీరంలో వున్న వేడిని, రక్తప్రసరణను, బి.పి, ఆస్తమా అన్నింటినీ పారద్రోలవచ్చును. ఇదే దినచర్య రోజూ పాటిస్తే మంచి ప్రతిఫలము వుంటుంది.
(యాత్ర)
శబరిమలై యాత్ర బస్సులోగానీ, ట్రైన్లో గాని చేయుటకు అనుకూలము. ముఖ్యముగా గాలి ప్రయాణము చేయకూడదు. యిరుముడి కట్టుకుని దేవతా మార్గమున ప్రయాణము చేస్తే స్వామి కృపకు అనర్హులని మా విశ్వాసము.
ప్రతీ స్వామి ముందుగా మాల వేసుకొని 41 రోజులు | పూర్తిచేసుకుని శబరిమల యాత్రకు బయలుదేరి 41
రోజులకన్నా తక్కువ దీక్ష చేస్తే దీక్షలేని ప్రతిఫలం కాని వనయత్త బలంకాని ప్రాప్తించదు.
మాల వేసుకుని ముందు కన్నెస్వామి గురుస్వామిని సంప్రదించవలెను. అనగా కనీసం 10 సంవత్సరములుగా ప్రతియేడు వనయాత్ర చేసి జ్యోతిని దర్శనం చేసిన స్వామి. దానియొక్క ప్రతిఫలం దక్కుతుంది. ఈ రోజులలో 5 సార్లు వెళ్ళి వచ్చిన స్వాములు కూడ గురుస్వామిగా భావించుచున్నారు. కాని ఇది సబబు కాదు. 10 సంవత్సరములు ఎందుకు అనగా స్వామియొక్క నియమాలు క్షుణ్ణంగా తెలుస్తాయి.
మాలవేసుకొనే ముందు పాటించవలసినవి నియమాలు ముందుగా సీనియర్ గురుస్వామిని సంప్రదించి పూజా పటము సామాగ్రి స్వామితో వెళ్ళి కొనుక్కోవాలి. యజ్ఞోపవీతం మార్చుకోవాలి. మరియు మొలదారము
మార్చుకోవాలి. స్వామి ప్రతిమను బూమికంటే 2 అడుగులు | యెత్తయిన ప్రదేశమున సిమెంటు షెల్ఫ్కని బల్లకాని, దానిమీద నూతన వస్త్రం వేసి పీఠం పెట్టుకోవాలి.
ఒక్కసారి పీఠము పెట్టిన తరువాత మార్చకూడదు. కదపకూడదు. రోజూ పూజ తప్పనిసరి లేనిచో ప్రతిఫలం దక్కదు. అత్యవసర పరిస్థితులు వేరే రాష్ట్రమునకు వెళ్ళవలసి వచ్చినపుడు కూడా నియమాలు పాటించవలయును. బయట ఏమీ తినకూడదు. కేవలము పళ్ళు అవి కూడా స్వామికి నైవేద్యము పెట్టిన తరువాతనే స్వీకరించాలి. రెండు పూటలు స్నానము తప్పదు. అనువైన ప్రదేశములో పూజలు చేయాలి (గుళ్ళలో).
ఒక్కసారి పీఠము పెట్టి పూజ చేసిన తరువాత అదే పీఠమున పూజ చేయాలి. వేరే పీఠము దగ్గర చేసినచో చాలా ఆటంకములు వచ్చును. దీక్షలో పూజ వస్త్రాలు అనగా
లుంగీనే ధరించాలి. స్వామి శక్తి మేరకు కనీసం 5 స్వాములకు భిక్ష పెట్టినచో మంచిది. అన్ని దానముల కన్నా అన్నదానము చాలా గొప్పది. ఇది ఆసరాగా తీసుకొని కొందరు స్వాములు కంగారు పడతారు. స్వామి శక్తికొలది పూజ పెద్దరికాని చిన్నదిగా కాని చేయవచ్చును.
ప్రతి స్వామి శబరిమలై యాత్ర చేసే ముందుగా, పెటవావర స్వామిని దర్శించి, శ్రీధర్మశాస్త్రని దర్శించి రంగులు పూసుకుని బాజా భజంత్రీలతో ఆడుతూ పాడుతూ ఉత్సాహముగా వనయాత్రకు కొనసాగాలి. ఇందులో కన్నెస్వామి నుంచి 25, 30 సార్లు వేలే స్వామిలైన యరిమేలి దర్శించి వెళ్ళాలి. ఎంత సీనియర్ స్వామి అయినా యెరిమెలి వచ్చి వావరు స్వామిని దర్శించి పెటతుల్లి ఆడితేనే దర్శనప్రతిఫలం వుంటుంది.
ప్రతిస్వామి 41 రోజులు దీక్షచేసి యరిమెలి నుంచి వనయాత్రచేసి స్వామిని దర్శించి జ్యోతిని దర్శించి పునీతులు కావలెను. యాత్ర ప్రారంభం నుంచి మన క్షేమ సమాచారము
బంధుమిత్రులకు కాని తల్లిదండ్రులకు కాని |
తెలియచేయకూడదు అనగా ఫోన్ చేయకూడదు. |
కార్తీకమాసం శివునికి చాలా ప్రీతివంతమైనది. మార్గశిరమాసం విష్ణుకు ప్రీతికరం. కార్తీకం కన్న ముందు మాల వేయకూడదు. ప్రతి సంవత్సరం నవంబరు నెలలో 16న గుడి తెరుస్తారు. ఆ తరువాతే మాల వేయాలి. మనకనుకూలముగా అర్ధ మండలము, పావు మండలము, మాల వేసుకున్నచో ప్రతిఫలం వుండదు. మాల వేసుకునే ముందు రోజు స్వాములు మాంసం తిని మద్యం సేవిస్తారు. ఇది పద్ధతి కాదు. అది ఉదయం మన కడుపులో శేషం వుంటుంది. మన కడుపులో వుంచుకుని మాల ఎలా వేసుకుంటారు. మాల వేసుకున్న స్వామియొక్క కుటుంబ సభ్యులు కూడా మధ్య మాంసములు నిషేదిస్తే మంచిది. మనకనుకూలముగా స్వామియొక్క నియమాలను మలచరాదు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే అన్నదాన ప్రభువే అనాధరక్షకనే అయ్యప్పనే
అరియుంగావు అయ్యవే
అచ్చంకోవిల్ అరసే
అయిందుమలై వాసరే
అళుదామేడే
అప్పాచిమేడే
ఆపత్బాంధవనే
ఆశ్రితవత్సలనే
ఆనందరూపనే
కన్నిమూలగణపతి భగవానే
కరుప్ప స్వామినే
కన్నిమార్తె కాప్పవనే అమిత గుణాకరనే
అలంకార ప్రియనే
అభిషేకప్రియనే
అశుదానధియెనే
కరిమలై ఏట్రమే
కరిమలై ఎరక్కమే
కర్పూర జ్యోతియే
కట్టాళవిషరారమ్
కాంతామనానాసినే
కాశీవాసినే
కాత్తు రక్షీక్కణే సకళత్తుపుళైబాలకనే
సర్వరోగనివారణయే
ధన్వంతరమూర్తయే సర్వమంగళదాయకనే
సద్గుణమూర్తయే
సకలకళావల్లభనే
స్వామియన్ పుంగావనమే
సావిప్పవర్ కానందమూర్తియే మాతాపితాగురుదైవమే
మాళికాపురత్తదు లోకదేవిమాతావే
మాధవసుతనే
మామలైవాసవే
కరుపత్తూరు వాసియే
కన్నడ దైవమే
కలియుగవరదనే
కళ్ళిడంకుండ్రే
పంపాశిశునే
పందళత్తుకుమరనే
పంబయిల్ విళక్కే
పదునెట్టాంబడియే
పదునెట్టాంబడికధిపతియే పరమశివన్ పుత్తరినే
పూర్ణపుష్కలనాధనే
పొన్నాంబలవాసనే
వానరస్ తోళరే
వానర్ స్వామియే
వీరాధివీరనే
వీరమణికంఠనే
వేదప్పొరుళి వేదప్రియనే
వేదాంతరూపనే
భూతగణాధిపతయే
భూలోకనాధనేయే
భక్తవత్సలనే
భస్మకుశనే
మహిషమర్దనవే
మకరజ్యోతియే
మోహనరూపసే
మోహినీసుతనే
పరంజ్యోతియే
భక్తచిత్తాదివాసనే
భువనేశ్వరినే
శరణుఘోషప్రియనే
శంకరసుతనే
శబరిగిరీసే
పరాత్పరనే
పరాశక్తియే
పంపానదినే
శరంకుత్తి ఆలే శ్రీరంగపట్టణవాసినే
శబరపీఠమే
పెరియాతపట్టమే
చెరియానపట్టమే
యదుకులవీరనే
యంగన్ కులదైవమే
హరిద్వార్ నివాసమే
హరిహరసుతనే
శ్రీధర్మశాస్తానే
ఎరుమేలి శాస్తానే గొల్లపూడి ధర్మశాస్తానే ఓంకారప్పొరుళే నిత్యం బ్రహ్మచారినే
లోకరక్షకనే ఋషికులరక్షకవే
ఉత్తర నక్షత్రజాతకనే
శత్రుసంహారిణే
శక్తిరూపనే
శాంతమూర్తయే
తపోధనే
విష్ణుసుతనే
హోమప్రియే
యిరుముడి ప్రియనే
పెణ్ పులివాహనే నాగరాజవే
షన్ ముఖనంబివే
గణపతి సోదరినే
నెయ్యాభిషేకప్రియవే
నీలమైఏట్రమే జగన్మోహననే
జ్యోతిస్వరూపిణే ఓంశ్రీహరిహరసుతనే
ఆనందచిత్తనే అయ్యనేఅయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓమ్! స్వామియే శరణమయ్యప్ప!
సమస్తాపరాధ రక్షకునే శరణ మయ్యప్ప
స్వామి అయ్యప్ప లఘు పూజావిధానం
స్థలశుద్ధి
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా | యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్చుచిః॥ పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!
మొదట ఏకవత్తి దీపం వెలిగిస్తూ పూజను ఓంకార శబ్ధముతో ప్రారంభించవలయును ఓం
ఓం......
గణపతి ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే॥
ఓం ||
గజాననం భూత గణాధి సేవితం కపిత్థజంభూ ఫలసార భక్షితం ఉమాసుతం శోకవినా శకారణం నమామి విఘ్నేశ్వర
పాద పంకజం||
ఓం గణానాంత్వాం గణపతిగుం హవామహే కవిం కవీనా
మువ మస్త్ర వస్తమం।
జ్యేష్ట రాజం బ్రహ్మాణాం బ్రహ్మాణస్పత ఆనః శృణ్వన్నూతిభిః
సీత సాధనం॥
గురువందనము
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
సరస్వతి
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి పూజారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ॥
ఆచమనీయము
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా । ఈ మూడు నామములు చెబుతూ |
మూడు ఉద్ధరిణిల జలము లోనికి పుచ్చుకొని, నాల్గవ ఉద్దరిణి జలముతో చేయిశుద్ధి చేసుకొనవలెను.
ఓం గోవిందాయ నమః విష్ణువే నమః| మధుసూదనాయ | నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ | నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ | నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః| ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః॥ జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే | నమః శ్రీ కృష్ణాయ నమః||
అయ్యప్ప స్వామి ప్రార్ధన
అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జ శూరం సురగణ
ముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం |
హరిహర సుతమీశం తారక బ్రహ్మరూపం
శబరిగిరి నివాసం భావయే శ్రీ భూతనాథం ॥
భూతోచ్చాటనం
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యేతే భూమి భారకాః| ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
ప్రాణాయామం
ఓం భూః| ఓంభువః ఓం సువః | ఓం మహః| ఓం జనః ఓం తపః ఓం సత్యం | ఓం తత్సవితుర్వణేణ్యం | | భర్గోదేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్। ఓ మాపోజ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం॥
సంకల్పము
మమోపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శ్రీ అయ్యప్ప స్వామి లఘు పూజాం కరిష్యే||
షోడశ పూజ
శ్రీ అయ్యప్పస్వామినే నమః
ఆవాహయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
ఆసనం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
పాద్యం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
అర్ఘ్యం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
ఆచమనం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
స్నానం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
వస్త్రం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
గంధం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
ధూపం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
దీపం సమర్పయామి శ్రీ అయ్యప్పస్వామినే నమః
అక్షతాన్ సమర్పయామి
నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| | ధియోయోనః ప్రచోదయాత్।
సత్యం త్వర్తేన పరిషించామి।
అమృతమస్తు।
అమృతోపస్తరణమసి స్వాహా|
ఓం ప్రాణాయ స్వాహా! అపానాయ స్వాహాః వ్యానాయ స్వాహా! ఉదానాయ | స్వాహా! సమానాయ స్వాహా|
బ్రహ్మణే స్వాహా|
బ్రహ్మణిమ ఆత్మ అమృతత్వాయః శ్రీ అయ్యప్పస్వామి నమః అవసరార్థం కదలీఫలం నారీకేళ ఖండ ద్వయం నివేదయామి।
నివేదనా నంతరం ఆచమనీయం సమర్పయామి |
కర్పూర నీరాజనం సమర్పయామి।
నీరాజనానంతరం ఆచమనీయం |
సమర్పయామి||
శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళిః
ప్రతి నామమునకు చివర ఓం మణికంఠాయ నమః అని చదువుకొనవలెను.
ఓం మహాశాస్త్రే నమః
ఓం విశ్వశాస్తే
ఓం లోకశాస్తే
ఓం మహాబలాయ
ఓం ధర్మశాస్తే
ఓం మహాబలాయ
ఓం ధర్మశాస్తే
ఓం వీరశాస్తే
ఓం కాలశాస్తే
ఓం మహాద్యుతాయ
ఓం గణాధ్యక్షాయ
ఓం అగ్రగణ్యాయ
ఓం మహాగుణగణాయ
ఓం ఋగ్వేదరూపాయ ఓం నక్షత్రాయ
ఓం చంద్రరూపాయ నమః
ఓం వాహకాయ
ఓం దుర్వాయ ఓం శ్యామాయ
ఓం మహారూపాయ
ఓం క్రూరదృష్టే
ఓం అనామయాయ
ఓం త్రినేత్రాయ
ఓం ఉత్పలాకారాయ
ఓం కాలాంతకాయ
ఓం మణికంఠాయ
ఓం నరాధిపాయ
ఓం దక్షమూషకాయ
ఓం కల్హార కుసుమప్రియాయ
ఓం మదనాయ
ఓం మాధవసుతాయ
ఓం మందార కుసుమప్రియాయ
ఓం మదాలసాయ నమః
ఓం వీరశాస్తే
ఓం మహాసర్ప విభూషితాయ ఓం మహాసర్ప విభూతాయ ఓం మహాసూరాయ
ఓం మహాధీరాయ
ఓం మహాపాప వినాశకాయ
ఓం కపి హస్తాయ
ఓం శరదరాయ
ఓం హలా హలా ధరసుతాయ
ఓం అగ్ని నయనాయ
ఓం అర్జునపతే
ఓం అనంగ మదనాతురాయ
ఓం దుష్ట గ్రహాధిపాయ
ఓం శాస్తే
ఓం శిష్ట రక్షణ దీక్షితాయ నమః
ఓం రాజ రాజార్చితాయ
ఓం రాజశేఖరాయ ఓం రాజోత్తమాయ
ఓం మంజుకాలేయ
ఓం పరరుచయే
ఓం వరదాయ
ఓం వాయువాహనాయ
ఓం వజ్రాంగాయ
ఓం విష్ణుపుత్రాయ
ఓం ఖడ్గప్రాణయే
ఓం బలోద్యతాయ ఓం త్రిలోకజ్ఞానాయ
ఓం అతిబలాయ
ఓం కస్తూరీ తిలకాంచితాయ
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణధవళాయ ఓం పూర్ణలేశాయ
ఓం కృపాలయాయ ఓం వనజనాధిపాయ
ఓం పాశహస్తాయ
ఓం భయాపహాయ
ఓం ఓంకార రూపాయ
ఓం పాపఘ్నాయ
ఓం పాషండ రుథిరాశనాయ
ఓం పంచపాండవ సంరక్షకాయ
ఓం పరపాప వినాశకాయ
ఓం పంచాక్షర పరాయణాయ
ఓం పండితాయ
ఓం శ్రీధర సుతాయ నమః
ఓం న్యాయాయ నమః ఓం కవచినే
ఓం కరీణా మధిపాయ
ఓం కాండయజుషే
ఓం తర్పణ ప్రియాయ ఓం శ్యామ రూపాయ ఓం సవ్య ధన్యాయ
ఓం సంతాప వినాశకాయ
ఓం వ్యాఘ్రచర్మ ధరాయ ఓం శూలినే
ఓం కృపాలయాయ నమః
ఓం వేణు వదనాయ
ఓం కంకంఠాయ
ఓం కళ రవాయ నమః
ఓం కిరీటాది విభూషితాయ
ఓం ధూర్జటినే నమః
ఓం వీరనిలయాయ
ఓం వీరాయ
ఓం వీరేంద్రవందితాయ
ఓం విశ్వరూపాయ
ఓం వీరపతయే
ఓం వివిదార్ధఫలప్రదాయ
ఓం మహారూపాయ
ఓం చతుర్భాహవే
ఓం పాపవిమోచకాయ
ఓం నాగకుండలధరాయ
ఓం కిరీటాయ నమః
ఓం జటాధరాయ
ఓం నాగాలంకార సంయుక్తాయ
ఓం నానారత్న విభూషితాయ
శ్రీశ్రీ పూర్ణ పుష్కలాంబ సహిత అయ్యప్ప స్వామినే నమః
మంగళ హారతి
పల్లవి|| మంగళమని పాడరయ్య మణికంఠస్వామికి నేడు మంగళములు అయ్యప్ప మాకు నీయు మంగళము శబరిమలై నాధుడైన భగవంతుడీ స్వామి శరణన్నకాపాడేటి జగదీశుడితడు
దీక్షను బూనిన భక్తుల దీర్చెడిగాచెడివేలుపు అడుగడుగున సాయము నిచ్చే అయ్యప్ప ఇతడు
పందళరాజకుమారుడు వావరుకు హితుడు గురుపుత్రు గాచినవాడు గుణవంతుడితడు మహిషికి శాపవిమోచన శబరికి మోక్షపు దీవెన దివి వరుల రాజ్య సురక్షణ ఇచ్చినది ఇతడు తల్లికై దీక్షనుబట్టెను తండ్రి బాధ తీర్చెను పులిపాలకొరకై బోయెను సురసేవలందెను తప్పులన్నిసైచేను అయ్యప తమ్ముని రాజును చేసెను జ్యోతిగ మారిన దేవుడు సుందరుడు ఇతడు.
(కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు....) అన్నమయ్య కీర్తనవలె....
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.